- Advertisement -
ఇంగ్లండ్‌తో మంగళవారం రాజ్‌కోట్ వేదికగా జరిగిన మూడో టి20లో ఆతిథ్య భారత్ 26 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఈ సిరీస్‌లో టీమిండియాకు ఇదే తొలి ఓటమి కావడం గమనార్హం. ఈ గెలుపుతో ఇంగ్లండ్ సిరీస్‌లో భారత్ ఆధిక్యాన్ని 21కి తగ్గించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఓపెనర్ బెన్ డకెట్, లివింగ్‌స్టోన్‌లు విధ్వంసక బ్యాటింగ్‌తో అలరించారు.
డకెట్ 28 బంతుల్లోనే ఏడు ఫోర్లు, రెండు సిక్స్‌లతో 51 పరుగుల చేశాడు. లివింగ్‌స్టోన్ 5 సిక్సర్లు, ఒక ఫోర్‌తో 43 పరుగులు సాధించాడు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 24 పరుగులకే ఐదు వికెట్లను పడగొట్టాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 20 ఓవర్లలో 9 వికెట్లకు 145 పరుగులు మాత్రమే చేసి పరాజయం పాలైంది. హార్దిక్ పాండ్య (40) తప్ప మిగతావారు విఫలమయ్యారు.
- Advertisement -