Thursday, January 30, 2025

హైదరాబాద్ శివార్లలో రెండు ఐటి పార్కులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : హైదరాబాద్ శివారుల్లో కొత్తగా రెండు ఐటీ పార్కులను ఏ ర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్న ట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. హైదరాబాద్ లో రూ. 100 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చి న డ్యూ’ సాఫ్ట్ వేర్ కంపెనీ ప్రతినిధులతో మంగళవారం సచివాలయంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఐటీ రంగంలో హైదరాబాద్ వేగం గా అభివృద్ధి చెందుతుంది. ప్రముఖ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయని, అందుకే హైటెక్ సిటీ తరహాలోనే కొత్తగా మరో రెండు ఐటీ పార్కులను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. వీటిని ఎంత విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలి, నగర శివారుల్లో ఏయే ప్రాంతాల్లో ఇందుకు అనుకూలంగా ఉన్నాయో సంబంధిత యంత్రాంగం అధ్యయనం చేస్తుందని వివరించారు. ఐటీ పార్కుల్లో పనిచేసే ఉద్యోగులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తామని, రవాణా సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు.

ఎక్కడి నుంచైనా ఈ పార్కులకు చేరుకునేలా ఏర్పాట్లు చేస్తామని, ఈ పార్కుల్లో కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకువచ్చే సాఫ్ట్ వేర్ కంపెనీలకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే పరిశ్రమలకు భూకేటాయింపులపై ఇప్పటీ వరకు ప్రత్యేక పాలసీ అంటూ ఏదీ లేదని, దీని వల్ల పారిశ్రామికవేత్తలు ఇబ్బంది పడుతున్నారని, అందుకే ప్రత్యేక పాలసీని రూపొందించాలని నిర్ణయించామన్నారు. పెట్టుబడి, కల్పించే ఉద్యోగాల సంఖ్య ఆధారంగా భూమిని కేటాయిస్తామని, హైదరాబాద్ లో రూ.100 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకువచ్చిన డ్యూ సాఫ్ట్ వేర్ కంపెనీని సంతోషంగా ఆహ్వానిస్తున్నామన్నారు. ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా సహకరిస్తామని, రాబోయే అయిదేళ్లలో ఈ సంస్థ 900 మందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, టీజీఐఐసీ ఎండీ డా. విష్ణువర్ధన్ రెడ్డి, టీజీఐఐసీ సీఈవో మధుసూదన్, డ్యూ వెంచర్స్ ప్రెసిడెంట్ సురేష్, పాలకుర్తి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి ఝాన్సీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అలెరియా ఏఐ తో పన్నుల రాబడి పెరుగుదల : రాష్ట్ర ప్రభుత్వ పన్నుల వసూలు, ఇతర రాబడి మార్గాల్లో ఆదాయం నష్టపోకుండా చూసే ‘అలెరియా ఏఐ’ టెక్నాలజీ పనితీరు ఆసక్తికరంగా ఉందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఆ సంస్థ ప్రతినిధులు మంగళవారం సచివాలయంలోని తన కార్యాలయంలో ఇచ్చిన ప్రెజెంటేషన్ ను ఆయన తిలకించారు. ఆఫ్‌లైన్ లో పనిచేసే ఈ టూల్ ను ప్రభుత్వ విభాగాలకు సంధానిస్తే రాబడిలో నష్టపోతున్న 30 శాతాన్ని తిరిగి పొందవచ్చని సంస్థ ప్రతినిధులు ఆయనకు వివరించారు. వివిధ పథకాల్లో లబ్దిదారుల ఎంపికలో అర్హులు మాత్రమే ప్రయోజనం పొందేలా అలెరియా ఏఐ సహాయ పడుతుందని వారు వెల్లడించారు. ఫ్రాన్స్, యుఏఇ దేశాల్లో ప్రధాన కార్యాలయాలు ఉన్న ఈ టెక్నాలజీ సంస్థ పరిజ్ఞానాన్ని దేశంలో మార్కెట్ చేసేందుకు ఐబీటీ ఇన్నోవేషన్స్, ఇన్నోలాజిక్ టెక్నాలజీస్ అనుమతి పొందాయన్నారు. మంత్రి శ్రీధర్ బాబును కలిసిన వారిలో ఐబీటీ సిఇఓ మన్సూర్ అలీ ఖాన్, అలెరియా సిఇఓ ఎరిక్ లియాండ్రీ, ఇన్నోలాజిక్ సిఇఓ శివ దొండపాటి తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News