Thursday, January 30, 2025

ట్రంప్ టారిఫ్ వార్నింగ్

- Advertisement -
- Advertisement -

భారత్‌పై వంద శాతం సుంకాలు
విధిస్తాం అమెరికాకు హాని
చేస్తున్న చైనా, బ్రెజిల్ తదితర
దేశాలపైనా సుంకాలు పెంచక
తప్పదు అమెరికా వాసులకు
ఆదాయం పన్ను రద్దు
చేస్తాం విదేశాలపై పన్ను వేసి
అమెరికన్లను సుసంపన్నులను
చేస్తా అక్రమ వలసదారులపై
మోడీ సరైన నిర్ణయమే
తీసుకుంటారు దీనిపై భారత్‌తో
చర్చలు సాగుతున్నాయి మోడీ
ఫిబ్రవరిలో యుఎస్ సందర్శించే
అవకాశం : డొనాల్డ్ ట్రంప్

వాషింగ్టన్: అమెరికాకు హాని చేసే దేశాల పై భారీగా సుంకాలను విధించనున్నట్లు ప్రె సిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. చై నా, భారత్, బ్రెజిల్ దేశాలపై భారీగా సుం కాలు విధించనున్నట్లు ఆయన పేర్కొనడం గమనార్హం. అమెరికాకు హాని చేసే ఇతర దేశాలు, ఇతర ప్రజలపై భారీగా సుంకాలు విధిస్తున్నామని, ఆ దేశాలు అమెరికాకు న ష్టం చేస్తున్నా.. నిజానికి వారు వారివారి దే శాలకు మంచే చేసుకుంటున్నారని సోమవారం ఫ్లోరిడా రిట్రీట్‌లో హౌస్ రిపబ్లికన్‌ల తో మాట్లాడుతూ ట్రంప్ అన్నారు. అమెరి కా ప్రెసిడెంట్‌గా ట్రంప్ రెండో సారి ఎన్నికై న తర్వాత రిపబ్లికన్లకు ఇచ్చిన తొలి రిట్రీ ట్ ఇది. చైనా సుంకాల ద్వారా పెద్దఎత్తున సొమ్ము చేసుకుంటోంది. అలాగే భారత్, బ్రెజిల్ ఇతర దేశాలు. ఇది ఇక ముందు సా గదని, ప్రపంచంలో అమెరికానే నెంబర్ 1 గా చేసేందుకు తాను కృషి చేస్తున్నానని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా ఖజానా మ ళ్లీ కళకళ లాడేలా… మరింత సంపన్నంగా ఉండేలా..న్యాయబద్ధమైన పద్దతుల ద్వారా కృషి చేస్తుందని , మళ్లీ అమెరికా అత్యంత ధనిక దేశం కాగలదని.. అది అతి త్వరలోనే జరుగుతుందని డోనాల్ ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ నాలుగేళ్లలో అమెరికా మరింత ధనిక దేశంగా, శక్తిమంతమైన దేశంగా చేసి తీరతామని ట్రంప్ అన్నారు. భారతదేశంతో సహా బ్రిక్ దేశాలపై వందశాతం సుంకాలు విధించనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ట్రంప్ తన తొలి ప్రసంగంలో విదేశాలను సుసంపన్నం చేయడానికి అమెరికా పౌరులపై పన్ను విధించే బదులు, యుఎస్ పౌరులను సుసంపన్నం చేయడానికి మేము విదేశీ దేశాలపై సుంకాలు ,పన్నులు విధించాలని పేర్కొన్నారు. అమెరికా కంపెనీలు దేశంలోనే కంపెనీలను, వస్తు ఉత్పత్తి యూనిట్లను ఏర్పాటు చేస్తే. ఎలాంటి పన్నులు, సుంకాలు, లేకుండా చూస్తామని ట్రంప్ హామీ ఇచ్చారు. అమెరికన్ ఫస్ట్ .. ఆర్థిక నమూనా కింద, ఇతర దేశాలపై సుంకాలు పెరిగేకొద్దీ, అమెరికన్ కార్మికులు, వ్యాపారాలపై పన్నులు తగ్గుతాయి, అమెరికన్లకు భారీ సంఖ్యలో ఉద్యోగాలు, కర్మాగారాలు వస్తాయి అని ఆయన చెప్పారు.అమెరికావాసులకు ఆదాయం పన్నును రద్దు చేస్తామని ఈసందర్భంగా ప్రకటించారు.

స్టీల్ ప్లాంట్లు, సెమీ కండక్టర్లు, ఫార్మస్యూటికల్ కంపెనీ, ఇతర పరిశ్రమలు ఏర్పాటు చేస్తే..అమెరికన్లకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది. అల్యూనినియం, రాగి, ఉక్కు వంటి దేశంలోని ఉత్పత్తులపై అన్ని సుంకాలు తొలగించి సైన్యం అవసరాలను తీర్చండి అని అమెరికన్ పారిశ్రామిక వేత్తలకు పిలుపు నిచ్చారు. ఒకప్పుడు అమెరికాలో ఒక్క రోజులో ఒక షిప్ నిర్మించాం.. మళ్లీ దేశంలో నౌకల ఉత్పత్తి సాగాలని ప్రెసిడెంట్ అన్నారు.
భారత్‌తో చర్చలు సాగుతున్నాయి
వాషింగ్టన్ : అక్రమ వలసదారులపై ‘ఏది సరైన పనో’ ప్రధాని నరేంద్ర మోడీ అదే చేస్తారని ట్రంప్ సూచించారు. ఈ విషయమై భారత్‌తో చర్చలు సాగుతున్నాయని ట్రంప్ తెలియజేశారు. ఫ్లోరిడా నుంచి జాయింట్ బేస్ ఆండ్రూస్‌కు తిరుగు ప్రయాణంలో ఎయిర్ ఫోర్స్ వన్‌లో విలేకరులతో మాట్లాడినప్పుడు ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ఫిబ్రవరిలో వైట్ హౌస్‌ను సందర్శించే అవకాశం ఉందని కూడా ఆయన ప్రకటించారు. ‘అక్రమ వలసదారులను తిరిగి తీసుకోవడానికి ఆయన (మోడీ) అంగీకరించారా’ అని విలేకరులు ట్రంప్‌ను ప్రశ్నించారు.

‘ఆయన (మోడీ) ఏది సరైనదో అదే చేస్తారు. మేము చర్చించుకుంటున్నాం’ అని ట్రంప్ తెలిపారు. ‘నేను ఆయనతో సోమవారం ఉదయం సుదీర్ఘ ఫోన్ కాల్‌లో మట్లాడాను.ఆయన వచ్చే నెల, బహుశా ఫిబ్రవరిలో వైట్ హౌస్‌కు రానున్నారు. మాకు భారత్‌తో ఎంతో మంచి అనుబంధం ఉంది’ అని ట్రంప్ విలేకరులకు చెప్పారు. సోమవారం మోడీతో జరిపిన ఫోన్ కాల్‌పై ఒక ప్రశ్నకు అధ్యక్షుడు ఆ విధంగా సమాధానం ఇచ్చారు. ప్రధానితో ఫోన్ కాల్ వివరాల గురించి విలేకరులు ప్రశ్నించినప్పుడు ‘మోడీతో ఫోన్ కాల్‌లో) ప్రతిదీ ప్రస్తావనకు వచ్చింది’ అని ట్రంప్ సమాధానం ఇచ్చారు. ట్రంప్ 2.0 సమయంలో యుఎస్‌కు ప్రధాని మోడీ తొలి పర్యటన ఆ ఫోన్ కాల్‌లో ఖరారైంది. అధ్యక్షుడుగా ట్రంప్ చివరి విదేశీ పర్యటన ఆయన మొడటి హయాంలో భారత్‌లో జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News