Thursday, January 30, 2025

డీప్‌సీక్ దడ!

- Advertisement -
- Advertisement -

అమెరికా స్టాక్ మార్కెట్లను
కుదిపేస్తున్న చైనా ఎఐ యాప్
అమెరికా టెక్‌స్టాక్స్ భారీగా
పతనం ఒక్కరోజులోనే
రూ. 51లక్షల కోట్లు క్షీణించిన
ఎన్‌విడియా విలువ 612
పాయింట్లు పతనమైన నాస్‌డాక్
ఎస్ అండ్ పి 500 టెక్‌సెక్టార్
5.6 శాతం ఢమాల్

బెంగళూరు : చైనాకు చెందిన ఎఐ మోడల్ డీప్‌సీక్ టెక్నాలజీ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అంతేకాదు అమెరికా మార్కెట్లను కుదిపేస్తోంది. ఈ చైనా ఎఐ యాప్ కారణంగా అమెరికన్ టెక్ కంపెనీలు బెంబేలెత్తిపోతున్నాయి. సోమవారం యుఎస్ మార్కెట్లో చిప్ కంపెనీ ఎన్‌విడియా విలువ 600 బిలియన్ డాలర్లు (రూ. 51.31 లక్షల కోట్లు) క్షీణించింది. అమెరికా చరిత్రలోనే ఈ కంపెనీకి ఒక్కరోజు అతిపెద్ద పతనం కా వడం గమనార్హం. ఎన్విడియా విలువ 2.90 ట్రిలియన్ డాలర్లకు (రూ.251 లక్షల కోట్లు) తగ్గింది. అంతకుముందు ఇది రూ.302 లక్షల కోట్లకు పైన ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనీస్ స్టార్టప్ డీప్‌సీక్ గురించి హెచ్చరిస్తూ, ఇది అమెరికా టెక్నాలజీ పరిశ్రమకు మేల్కొలుపు పిలుపు అని అన్నారు. టెక్ కంపెనీ ఎన్విడియా షేర్లు 142.62 డాలర్ల నుండి 118.58 డాలర్లకి పడిపోయాయి. ఎన్విడియా షేర్ల పతనం ప్రభావం అమెరికన్ స్టాక్ ఇండెక్స్ నాస్‌డాక్‌పై కూడా కనిపించింది.

సోమవారం నాస్‌డాక్ భారీగా 612.47 పాయింట్లు అంటే 3.07 శాతం క్షీణించింది. రెండో అమెరికన్ ఇండెక్స్ ఎస్ అండ్ పి 500 టెక్ సెక్టార్ 5.6 శాతం పతనమైంది. ఎన్‌విడియా హువాం గ్ సంపద 1 రోజులో రూ.1.79 లక్షల కోట్లు తగ్గింది. సోమవారం అమెరికన్ మార్కెట్‌లో జరిగిన పరిణామాల తర్వాత కంపెనీలు చైనీస్ ఎఐ మోడల్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలి అని ట్రంప్ అన్నారు. చైనీస్ ఎఐ మోడల్‌లు అమెరికన్ కంపెనీల కంటే చాలా చౌకైనవి, ఈ డీప్‌సీక్ పూర్తిగా ఉచిత, ఓపెన్ సోర్స్ ఎఐ మోడల్‌గా ఆదరణ పొందుతోంది. ఇది కాకుండా ఈ చైనా మోడల్‌ను చాలా తక్కువ ఖర్చుతో తయారు చేశారు. అయితే ఎన్విడియా, మైక్రోసాఫ్ట్, మెటా వంటి అమెరికన్ కంపెనీలు ఎఐ మోడల్‌లను తయారు చేయడంలో భారీ పెట్టుబడి పెట్టాయి. డీప్‌సీక్ కంపెనీ తన ఎఐ మోడల్‌ను కేవలం రూ.48.45 కోట్లతో అభివృద్ధి చేసిందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.

అత్యధిక డౌన్‌లోడ్‌లు
ఈ చైనా ఎఐ యాప్ ఆపిల్ యాప్ స్టోర్‌లో నం.1 స్థానానికి ఎగబాకింది. చైనీస్ కంపెనీ హాంగ్‌జౌ రూపొందించిన ఈ ఎఐ చాట్‌బాట్ డీప్‌సీక్ అత్యధికంగా డౌన్‌లోడ్ చేసిన యాప్‌గా మారింది. ఇది ప్రారంభించిన ఒక వారంలోనే ఊపందుకుంది. జనరేటివ్ ఎఐ స్పేస్‌లో చాట్ జిపిటి, ఇతర ప్రత్యర్థి సంస్థలను అధిగమించి అమెరికా, బ్రిటన్, చైనా, ఇండియా వంటి కీలక మార్కెట్లలో యాపిల్ స్టోర్‌లో మొదటి స్థానాన్ని చేజిక్కించుకుంది. అయితే భారత్‌లో గూగుల్ ప్లేలో డీప్‌సీక్ నం.26, చాట్ జిడిపి నం.4 స్థానంలో ఉంది. కానీ వచ్చే రోజుల్లో మార్పులు చోటుచేసుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. పర్పెక్సిటీ వ్యవస్థాపకుడు అరవిం ద్ శ్రీనివాస్ బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తూ, చైనా డీప్‌సీక్‌కు తాను కృతజ్ఞతలు తెలుపుతున్నానని, మొదటిసారి చాట్ జిపిటిని ఎవరు అధిగమిస్తారో చెప్పలేమని అన్నారు. మైక్రోసాఫ్ట్ సిఇఒ వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో పరోక్షంగా స్పందిస్తూ, చైనాలో జరుగుతున్న పరిణామాలను తీవ్రంగా పరిగణించాల్సి ఉందని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News