Thursday, January 30, 2025

వైద్యురాలి ఆత్మహత్యాయత్నం

- Advertisement -
- Advertisement -

భర్త, అత్తామామల వేధింపుల వల్ల ఓ వైద్యురాలు ఆత్మహత్యకు యత్నించిన సంఘటన సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…డాక్టర్ ప్రణీత, సుఖేందర్ రెడ్డి అమెరికాలో ఉండగా ప్రేమించుకున్నారు. తర్వాత ఇండియాకి వచ్చిన తర్వాత ఐదేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వీరికి కూతురు (4) ఉంది. భర్త ఏ పనిచేయకుండా జులాయిగా తిరుగుతుండగా, ప్రణీత వైద్యురాలిగా పనిచేస్తోంది. కాగా ప్రణీతను భర్త, అత్తామామ, ఆడపడుచులు నిత్యం వేధింపులకు గురిచేస్తున్నారు. దీనిపై చాలాసార్లు పెద్దలు సర్దిచెప్పినా కూడా వేధింపులు ఆగలేదు. దీంతో జీవితంపై విరక్తి చెందిన ప్రణీత సెల్ఫీ వీడియో తీసుకుంది.

అందులో తనను వేధిస్తున్న తీరును వివరించింది. భర్త, అత్తామామ, ఆడపడుచుల వేధింపులు భరించలేకపోతున్నానని, తన కూతురిని బాగా చూసుకోవాలని, భర్తకు ఇవ్వవద్దని ప్రణీత తల్లిదండ్రులను కోరింది. విషయం తెలుసుకున్న బంధువులు ప్రణీతను కర్మన్‌ఘాట్ జీవన్ ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పించారు.ఈ క్రమంలోనే ప్రణీత బంధువులు తమకు న్యాయం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ ఎదుట మంగళవారం రాత్రి ఆందోళన చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News