స్వదేశీ పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు పెంపొందించుకుంటూ అత్యుత్తమ అంతరిక్ష సంస్థ గా ఎదిగిన ఇస్రో చరిత్రాత్మక ప్రయోగానికి సిద్ధమైం ది. ఇస్రో భారత అంతరిక్ష చరిత్రలో మరో మైలురాయి ని సాధించడానికి సమయం సమీపించింది. భారత అంతరిక్షపరిశోధన సంస్థ ఇస్రో, తన 100వ ప్రయోగాన్ని బు ధవారం చేపట్టనుంది. ఆం ద్రప్రదేశ్లోని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి బుధవారం ఉదయం 6.23 గంటలకు జీఎస్ఎల్వీఎఫ్ 15 రాకెట్ ద్వారా ఎన్వీస్02 అనే శాటిలైట్‌ను ఇస్రో అంతరిక్షం లోకి పంపించనుంది. అయితే ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ మంగళవారం తెల్లవారు జామున 2.52 గంటలకు ప్రారంభమైంది. 27 గంటల పాటు కొనసాగనున్న ఈ కౌంట్‌డౌన్ బుధవారం ఉదయం 6.23 గంటలకు ముగిసిన తర్వాత నింగిలోకి ప్రవేశిస్తుంది. ఇస్రో ఛైర్మన్‌గా జనవరి 13న బాధ్యతలు చేపట్టిన వి. నారాయణన్‌కు ఇది మొదటి మిషన్ కానుంది.
ఈ జిఎస్ఎల్వీ ఎఫ్ 15 రాకెట్ ప్రయోగం కోసం ఇప్పటికే దాన్ని షార్ లోని రెండో లాంచ్ ప్యాడ్ వద్దకు తరలించారు. జీఎస్ఎల్వీ సీరీస్‌లో ఈ జీఎస్ఎల్వీఎఫ్ 15 రాకెట్, 17 వది కాగా, దేశీయ క్రయోజెనిక్ కలిగిన 11 వ రాకెట్ కావడం గమనార్హం. ఈ ప్రయోగం ద్వారా ఎల్వీస్ 02 .. ఉపగ్రహాన్ని జియో సింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ లోకి ఇస్రో శాస్త్రవేత్తలు ప్రవేశ పెట్టనున్నారు. ఈ ప్రయోగం ద్వారా నావిగేషన్ వ్యవస్థ, నావిక్ మరింత విస్తృతం కానుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ ప్రయోగం కన్నా ముందు చేపట్టిన జిఎస్‌ఎల్‌విఎఫ్ 12 మిషన్ విజయవంతంగా నేవిగేషన్ శాటిలైట్ ఎన్విఎస్01ను మోసుకెళ్ల గలిగింది. దీని తరువాత ఇప్పుడు 50.9 మీటర్ల ఎత్తైన జిఎస్ఎల్వి ఎఫ్ 15 శాటిలైట్ ప్రయోగానికి సిద్ధమైంది. ఇది విజయవంతమైతే దేశీయ నావిగేషన్ వ్యవస్థ ‘నావిక్’ మరింత వేగంగా కచ్చితత్వంతో సేవలు అందించనుందని ఇస్రో వర్గాలు చెబుతున్నాయి,. ఇక ఈ ఎన్వీస్ 02 శాటిలైట్‌ను కర్ణాటక రాజధాని బెంగళూరు లోని యూఆర్ రావు శాటిలైట్ సెంటర్లో రూపొందించగా, దానికి ఇతర శాటిలైట్ సెంటర్లు సహకరించాయి.