Thursday, January 30, 2025

మహాకుంభమేళాలో తొక్కిసలాట: 15 మంది మృతి

- Advertisement -
- Advertisement -

లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో మహాకుంభమేళాలో తొక్కిసలాట జరిగింది. ప్రయాగ్ రాజ్ వద్ద జరిగిన తొక్కిసలాటలో 15 మృతి చెందగా 50 మందికి పైగా భక్తులు తీవ్రంగా గాయపడ్డారు.మౌని అమవాస్య సందర్భంగా భక్తులు తండోపతండాలుగా తరలి రావడంతో బారికేడ్లు విరిగాయి. గాయపడ్డవారిని అంబులెన్స్‌లలో ఆసుప్రత్రులకు తరలించారు. మహాకుంభమేళాలో తొక్కిసలాట జరగడంతో అఖండ పరిషత్‌ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. అమృత స్నానాలు రద్దు చేసుకున్నామని అఖండ పరిషత్‌ కమిటీ తెలిపింది. కుంభమేళాలో తొక్కిసలాట ఘటనపై ప్రధాని నరేంద్ర, యుపి సిఎం యోగి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు.ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు మోడీ ఫోన్ చేసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. యుపి రాష్ట్రం బాగ్‌పత్ జిల్లాలో జైన మతస్థులు నిర్వహించిన మోక కల్యాణ నిర్వాణ మహోత్సవ్ కార్యక్రమంలో కర్రట మెట్లు కూలిపోవడంతో ఏడుగురు మృతి చెందగా 60 మంది గాయపడిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News