Friday, January 31, 2025

ఇన్సురెన్స్ డబ్బుల కోసం చెల్లిని చంపి… పోలీసులకు రోడ్డు ప్రమాదం చూపించాడు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఇన్సురెన్స్ డబ్బుల కోసం చెల్లిని అన్న హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా పొదిలిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. పునుగోడు గ్రామంలో మాలపాటి సంధ్య విడాకులు తీసకొని తన పుట్టింట్లో ఉంటున్నారు. సంధ్యకు సోదరుడు అశోక్ ఉన్నాడు. 2023 నవంబరులో రూ.70 లక్షల ఇన్సురెన్స్ పాలసీలు సంధ్య తీసుకొని తన సోదరుడు అశోక్‌ను నామినీగా పెట్టింది. అశోక్ కు ఇన్సురెన్ సొమ్ముపై ఆశ కలగడంతో తన చెల్లిని అంతం చేయాలని ప్లాన్ వేశాడు. ప్లాన్‌లో భాగంగా ఆమె ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఒంగోలులోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. కారులో తిరిగొస్తున్న క్రమంలో నిద్రమాత్రలు కలిపిన నీటిని తాగించాడు. ఆమె నిద్రలోకి జారుకున్న తరువాత గొంతు నులిమి హత్య చేశాడు.

పొదిలి మండలం కాటూవారిపాలె గ్రామ శివారులో కారును చెట్టుకు ఢీకొట్టాడు. రోడ్డు ప్రమాదంలో తన చెల్లి చనిపోయిందని అందరినీ నమ్మించాడు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. తన చెల్లిని చంపిన విషయం స్నేహితుడు మాలకొండారెడ్డికి అశోక్ చెప్పాడు. శవ పరీక్షలో మత్తు మందు ఇచ్చినట్టు దొరికిపోతావని అశోక్‌కు మాలకొండారెడ్డి చెప్పాడు. ఆస్పత్రి సిబ్బంది యూసుఫ్‌కు మూడు లక్షల రూపాయలు ఇచ్చి తన చెల్లి అవయవాల స్థానంలో వేరే వ్యక్తివి పెట్టి పరీక్షలు చేయించాడు. పోలీసులు ఎప్పటికప్పుడు సంధ్య పోస్టు మార్టమ్ రిపోర్టులు తెప్పించుకొని పోలీసులు విచారణ చేస్తున్నారు. విచారణలో అవయవాలు మార్చినట్టు తెలియడంతో యూసుఫ్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా అసలు నిజాలు ఒప్పుకున్నాడు. వెంటనే అశోక్, మాలకొండారెడ్డి, యూసుఫ్‌లను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. అశోక్ తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News