డిగ్రీ ఫైనలియర్ విద్యార్ధులు కూడా సివిల్స్ కు అప్లై చేసుకోవచ్చనీ వ్యక్తిత్వ వికాస నిపుణులు. పౌర సరఫరాల శాఖ ఎన్ ఫోర్స్ మెంట్ డిప్యూటీ తహశీల్దార్ మాచన రఘునందన్ సూచించారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యు పి ఎస్ సి) నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్ష కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఫిబ్రవరి 11 వరకు ఉందని మాచన రఘునందన్ చెప్పారు. డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యేవారు సివిల్స్ రాసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అఖిల భారత స్థాయి లో నిర్వహించే ఉన్నత స్థాయి పరీక్ష పై విద్యార్థులకు అవగాహన వస్తుందని అభిప్రాయపడ్డారు. కృషి, పట్టుదల, అద్భుత ప్రతిభ ఉంటే ఉన్నత ఉద్యోగ యోగం సాధ్యమయ్యే అవకాశాలు లేకపోలేదని “మాచన” ఆశా భావం వ్యక్తం చేశారు. సివిల్స్ మనకు సాధ్యమా?! అనుకునే బదులు అసాధ్యం ఏదీ లేదన్న అత్మ విశ్వాసం కలిగి ఉండాలన్నారు.
పౌర సరఫరాల శాఖ ఎన్ ఫోర్స్ మెంట్ డిప్యూటీ తహశీల్దార్ మాచన రఘునందన్