Friday, January 31, 2025

ఏందయ్యా ఆ బ్యాటింగ్.. పాండ్యాపై మాజీ క్రికెటర్లు ఫైర్

- Advertisement -
- Advertisement -

ఇంగ్లండ్ జట్టుతో జరిగిన మూడో టీ20లో హార్దిక్‌ పాండ్యా బ్యాటింగ్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు మాజీ క్రికెటర్లు పాండ్యా ఆట తీరుపై మండిపడుతున్నారు. టీ20లో ఆది నుంచే వేగంగా ఆడాల్సి ఉంటుందని.. కానీ, పాండ్యా మాత్రం బంతులను వృథా చేయడంపై పార్థివ్ పటేల్, ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మిడిల్‌ ఓవర్లలోనూ హార్దిక్.. దూకుడుగా ఆడకుండా నెమ్మదిగా బ్యాటింగ్ చేయడం టీమిండియాకు నష్టం జరిగేలా చేసిందన్నారు.

ఓ వైపు జట్టు వికెట్లు కోల్పోతుండగా.. మరోవైపు రన్ రేట్ పెరుగిపోతున్నా.. మెయిన్ బ్యాటర్ గా క్రీజులో ఉన్న పాండ్యా ప్రత్యర్థులపై ఒత్తడి పెంచే విధంగా షాట్లు ఆడకుండా సింగిల్స్ కే పరిమితమయ్యాడని విమర్శించారు. తన ఇన్నింగ్స్ లో 35 బంతులు ఎదుర్కొన్న పాండ్యా.. కేవలం 40 పరుగులు మాత్రమే చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక, ధ్రువ్‌ జురెల్‌ను కూడా సరిగ్గా వినియోగించుకోవడం లేదని.. ఇప్పటికే తనేంటో నిరూపించుకున్న జురెల్ ను లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ కు పంపడాన్ని మాజీలు తప్పుబడుతున్నారు. భారత బ్యాటింగ్ ఆర్డర్ సరిగా లేదని కెవిన్ పీటర్సన్ అన్నాడు. జురెల్ ను ఇంకాస్త ముందుగా బ్యాటింగ్ కు పంపించాల్సిందని పేర్కొన్నాడు.

కాగా, మంగళవారం జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో టీమిండియాపై ఇంగ్లండ్ 26 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లీష్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన టీమిండియా.. వరుసగా వికెట్లు చేజార్చుకుంది. ఓపెనర్ సంజు శాంసన్(03), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(14)లు మరోసారి విఫలమయ్యారు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ(24) ఉన్నంత సేపు దూకుడుగా ఆడాడు. ఆ తర్వాత ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు. హార్దిక్(40) కీలక సమయంలో ఔటయ్యాడు.దీంతో భారత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 145 పరుగులకే పరిమితమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News