Friday, January 31, 2025

ఖనిజాల రంగంలో స్వయం సాధన కోసం నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ ఏర్పాటు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీః పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు ముందు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రూ.16,300 కోట్ల ఖర్చుతో.. నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశం అనంతరం సమాచార, ప్రసారాల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు ఈ విషయం తెలిపారు. కీలకమైన ఖనిజాల దిగుమతులపై ఆధారపడడం తగ్గించి, ఆ రంగంలో స్వయం ప్రతిపత్తి కోసం కృషి చేయడమే మిషన్ లక్ష్యం అని స్పష్టం చేశారు. దేశం వివిధ ప్రాంతాలలోనూ, సముద్రగర్భంలోనూ కీలక మైన ఖనిజాల అన్వేషణకు ఈ మిషన్ దోహదపడుతుందని అశ్విని వైష్ణవ్ అన్నారు.
నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ ఖనిజ అన్వేషణ, మైనింగ్, ప్రాసెసింగ్ తో పాటు వాటి వినియోగం ద్వారా ఉత్పత్తులు జరిగే వరకూ అన్ని దశలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. కీలకమైన ఖనిజాల మైనింగ్ ప్రాజెక్టులకు ఆమోద ప్రక్రియ వేగంగా జరిగేటందుకు ఫాస్ట్ ట్రాక్ విధానం అనుసరిస్తారు. అంతే కాదు మిషన్ క్లిష్టమైన ఖనిజ అన్వేషణకు ఆర్థిక ప్రోత్సాహకాలను కల్పిస్తుంది. ఖనిజాల వెలికితీతలో అదనపు భారం పడే సందర్భాల్లో తగిన సహాయ సహకారాలు అందిస్తుంది.
దేశంలో కీలకమైన ఖనిజాల నిల్వలను అభివృద్ధి చేయడానికి కృషి చేయడం తో పాటు భారత ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు సంస్థలు అవసరమైన కీలక ఖనిజాలను దిగుమతి చేసుకోవలసిన పరిస్థితుల్లో అలాంటి ఖనిజాల నిల్వలుగల దేశాలతో లావాదేవీల విషయంలోనూ కీలక సహాయ సహకారాలు అందిస్తుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News