హర్యానా యమునానది జలాలను విషపూరితం చేస్తోందన్న ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై హర్యానా సర్కార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆయనపై కేసు పెట్టింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లకోసం కేజ్రీవాల్ ఢిల్లీ, హర్యానాలో భయాందో ళనలు రేకెత్తించే నీచానికి పాల్పడుతున్నాడని హర్యానా మంత్రి విపుల్ గోయల్ విమర్శించారు. కేజ్రీవాల్ ఆరోపణలలో ఎలాంటి నిజం లేదు.. కేజ్రీవాల్ తన వ్యాఖ్యలకు విచారం వ్యక్తం చేసి ఢిల్లీ, హర్యానా ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పేవరకూ విడిచి పెట్టబో మని విపుల్ గోయల్ స్పష్టం చేసారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ విషయంలో ఫిర్యాదు చేయడం, సోనిపట్‌లోని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు లో డిజాస్టర్ మేనేజ్మెంట్ సెక్షన్ల కింద కేసు దాఖలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం ఢిల్లీకి సరఫరా చేస్తున్న యమునా నీటిని విషపూరితం చేస్తోందని, పరిమితినిమించి అధిక స్థాయిలో అంటే దాదాపు 700 రెట్లు ఎక్కువగా అమోనియా కలుపుతోందనిఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ సోమవారం ఆరోపించారు.