Friday, January 31, 2025

ఏడుపాయలకు భారీ పోటెత్తిన భక్తులు

- Advertisement -
- Advertisement -

మాఘ అమావాస్య సందర్భంగా మెదక్ జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయలకు భక్తులు బుధవారం పోటెత్తారు. ఆలయ అర్చకులు తెల్లవారుజామున పూజలకు శ్రీకారం చుట్టారు. ఏడుపాయలలో ఉత్తర వాహినిగా ప్రవహించే మంజీరా నదిలో పవిత్ర స్నానాలు చేస్తే పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఈ మేరకు మాఘ అమావాస్య రోజు ఏడుపాయల్లో మంజీర నదిలో పవిత్ర స్నానాలు చేసేందుకు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రదానంగా జంట నగరాలైన హైదరాబాద్‌తోపాటు పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర నుంచి సుమారు లక్ష మంది భక్తులు తరలివచ్చారు. నదిలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ వనదుర్గాభవాని అమ్మవారిని దర్శించుకుని వివిధ రూపాలలో మొక్కులు చెల్లించుకున్న భక్తులు భక్తుల సౌకర్యార్థం ఆలయ ఇఒ చంద్రశేఖర్ ఏర్పాట్లు చేశారు.

భక్తులు నది స్నానాలు చేసేందుకు సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు నుంచి ఈనెల 25వ తేదీన 0.35 టిఎంసిల నీటిని విడుదల చేయగా ఆ నీరు చేరికతో ఏడుపాయలలోని ఘనపూర్ ఆనకట్ట పూర్తిగా నిండి నిండుకుండలా మారింది. భక్తులు పవిత్ర స్నానాలు చేసేందుకు వీలుగా ఘనపూర్ ఆనకట్ట దిగువన మంజీర నది పాయల పొడవునా ఆర్‌డబ్లుయస్ అధికారులు తొమ్మిదిచోట్ల షవర్ బాత్‌లను ఏర్పాటు చేశారు. భక్తులు సులభంగా అమ్మవారి దర్శనం చేసుకునేందుకు వీలుగా క్యూలైన్స్ ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్‌పి ఉదయ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో డిఎస్‌పి ప్రసన్నకుమార్ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు తగిన సౌకర్యాలు ఏర్పాటు చేసిన ఆలయ సిబ్బంది సూర్య శ్రీనివాస్, మధుసూదన్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, శ్రీనివాస్‌శర్మ, బ్రహ్మచారి తదితరులు సేవలు అందించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News