Friday, January 31, 2025

హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మికి మరో భారీ షాక్

- Advertisement -
- Advertisement -

నగర మేయర్ గద్వాల విజయలక్ష్మికి మరో భారీ షాక్ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు కుటుంబ సభ్యులకు సంబంధించిన స్థలాల క్రమబద్ధీకరణపై హైకోర్టు లో ప్రజాప్రయోజన వ్యాజ్యం బుధవారం దాఖలైంది. రఘువీరారెడ్డి అనే వ్యక్తి ఈ పిల్ ను దాఖలు చేశారు. బంజారాహిల్స్ లోని ఎన్బీటీ నగర్‌లో ఉన్న విలువైన భూములను జివొ నెం.56 ద్వారా కేటాయించారని పిటిషనర్ తన పిటిషన్‌లో వెల్లడించారు. ఈ కేసులో కేశవరావు కూతురు, జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి,

జిపిఎ హోల్డర్ కవిత, రెవెన్యూ అధికారులను ప్రతివాదులుగా చేర్చారు. వారికి కేటాయిస్తూ జారీ చేసిన జీవోను రద్దు చేస్తూ, ఆ భూమిని ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని పిటిషనర్ కోరారు. ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్ విచారణ చేపట్టారు. అయితే కౌంటర్ దాఖలు చేయడానికి ప్రతివాదుల తరపున న్యాయవాదులు కొంత గడువు కోరారు. దీంతో తదుపరి విచారణను వచ్చేనెల 27కు హైకోర్టు వాయిదా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News