శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు ఉస్మాన్ ఖ్వాజా, ట్రావిస్ హెడ్ జట్టుకు శుభారంభం అందించారు. ఇద్దరు లంక బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. హెడ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. ధాటిగా ఆడిన హెడ్ 40 బంతుల్లోనే 10 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 57 పరుగులు చేశాడు. ఇదే క్రమంలో తొలి వికెట్‌కు 92 పరుగులు జోడించాడు.
వన్‌డౌన్‌లో వచ్చి లబుషేన్ (20) పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అయితే కెప్టెన్ స్టీవ్ స్మిత్‌తో కలిసి ఖ్వాజా జోరును కొనసాగించాడు. ఇద్దరు అసాధారణ బ్యాటింగ్‌తో స్కోరును పరిగెత్తించారు. ఈ జోడీని విడగొట్టేందుకు లంక బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కీలక ఇన్నింగ్స్ ఆడిన ఖ్వాజా 210 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్స్‌తో 147 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. మరోవైపు కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన స్మిత్ 188 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్స్‌తో