చెన్నై: పాన్ కార్డులో మార్పులు చేయాలని కేంద్రానికి నటుడు విజయ్ సేతుపతి విజ్ఞప్తి చేశారు. పాన్ కార్డు సమాచారాన్ని తమిళంలోనూ అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తాజాగా జరిగిన ఓ ఈవెంట్లో పాన్ కార్డులో మార్పులపై మాట్లాడారు. పాన్ కార్డుకు సంబంధించిన సమాచారం, అప్డేట్లను తమిళంలో అందుబాటులో ఉంచాలని కోరారు. ప్రజలకు అర్ధమయ్యే భాషలో ఉంటే సమస్యలను మరింత తేలిగ్గా పరిష్కరించుకోవచ్చని విజయ్ సేతుపతి తెలిపాడు.
పాన్‌కార్డు సంబంధించిన సమాచారం బహుళ బాషల్లో ఉండాలని ఆయన విన్నవించారు. ప్రస్తుతం పాన్ కార్డు వివరాలు హిందీ, ఇంగ్లీష్ బాషల్లో మాత్రమే ఉన్నాయని వివరించారు. ఈ రెండు భాషలు రానివారు పాన్ కార్డు అప్డేట్ల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాన్ కార్డు వైబ్బైట్లో తమిళంలో సమాచారం ఉంటే తమిళులకు అర్థమవుతుందన్నారు. విజయ్ సేతుపతి నటించిన విడుదల 2 సినిమా విడుదల కానుంది. వెట్రిమారన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి నటిస్తున్నారు. విడుదల పార్ట్ 1కి కొనసాగింపుగా తీస్తున్నారు.