Friday, January 31, 2025

జిహెచ్ఎంసి కౌన్సిల్ సమావేశం రసాభాస

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జిహెచ్ఎంసి కౌన్సిల్ సమావేశం రసాభాసంగా మారింది. సభను 5 నిమిషాల పాటు మేయర్ వాయిదా వేశారు.   మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం గురువారం ఉదయం ప్రారంభమైంది. మేయర్‌కు వ్యతిరేకంగా బిఆర్ఎస్ సభ్యుల ఆందోళన చేపట్టారు. బడ్జెట్‌పై మాట్లాడాలని మేయర్‌ విజయలక్ష్మి కోరారు. క్వశ్చన్‌ అవర్‌ కోసం బిఆర్‌ఎస్‌ సభ్యులు పట్టుబట్టారు. బిఆర్ఎస్ కార్పొరేటర్లు మేయర్‌ పోడియం చుట్టుముట్టారు. బిఆర్ఎస్‌కు పోటీగా కాంగ్రెస్ సభ్యులు ఆందోళన చేపట్టారు. బిఆర్ఎస్ సభ్యులు కాగితాలు చించి మేయర్‌పై విసిరేశారు. మేయర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న బిఆర్‌ఎస్‌ కార్పొరేటర్లను మార్షల్స్‌ అడ్డుకున్నారు. గందరగోళం మధ్య సభను మేయర్‌ వాయిదా వేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News