Friday, January 31, 2025

ఫోన్ ట్యాపింగ్ కేసు.. భుజంగరావు, రాధాకిషన్‌రావుకు బెయిల్‌

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో పోలీసులు పలువురు అధికారులను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తుండగా.. మరోవైపు, కీలక నిందితులుగా ఉన్న మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు, మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుకు రాష్ట్ర హైకోర్టు బెయిల్ ఇచ్చింది. రూ.లక్ష చొప్పున 2 ష్యూరిటీలు, పాస్‌పోర్టులు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసులో పోలీసుల దర్యాప్తుకు సహకరించాలని కోర్టు ఆదేశించింది. ఇటీవల మరో నిందితుడిగా ఉన్న తిరుపతన్నకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News