Friday, January 31, 2025

దివ్యాంగులకు 5% రిజర్వేషన్లు

- Advertisement -
- Advertisement -

ప్రభుత్వ, ఎయిడెడ్ ఉన్నత
విద్యాసంస్థల్లో అమలు
గరిష్ఠ వయోపరిమితి ఐదేళ్లు
పెంపు ఉత్తర్వులు జారీ చేసిన
రాష్ట్ర ప్రభుత్వం

ఉత్తర్వులు జారీ
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ ఉన్నత విద్యాసంస్థల్లో వికలాంగులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యా సంస్థల్లో ఆయా వర్గాల ప్రవేశాలకు గరిష్ట వయోపరిమితిలోనూ 5 ఏళ్ల మినహాయింపు కల్పించింది. వికలాంగుల హక్కుల చట్టంలోని నిబంధనల మేరకు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి యోగితారాణా ఉత్తర్వులు జారీ చేశారు. వికలాంగులను మొత్తం ఐదు కేటగిరీలుగా విభజించి ఒక్కో కేటగిరీ వైకల్యానికి ఒక్కో శాతం రిజర్వేషన్ అమలు చేయనున్నారు. దృష్టి లోపం -ఏ కేటగిరి, వినికిడి లోపం, మూగ- బి కేటగిరి, అంగవైకల్యం సి, మానసిక వైకల్యం -డి, ఒకటికి మించిన వైకల్యాలు- ఇ కేటగిరీలుగా విభజించారు. ఈ ఈ రిజర్వేషన్లు రొటేషన్ పద్దతిలో కొనసాగనున్నాయి. ఒక కేటగిరిలో అర్హులైన అభ్యర్థులు లేకుంటే ఆ రిజర్వేషన్‌ను తదుపరి కేటగిరి అభ్యర్థులకు వర్తింపజేస్తారు. ప్రవేశాల్లో అసలు వికలాంగులైన అభ్యర్థులే లేకుంటే ఆ ఖాళీలను సంబంధిత రిజర్వుడు (ఎస్‌సి, ఎస్‌టి, బిసి) వర్గాల్లోని సాధారణ అభ్యర్థులతో మెరిట్ ప్రకారం ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News