Friday, January 31, 2025

తపన్ బోస్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

78ఏళ్ల వయస్సులో
అంతిమ శ్వాస
డాక్యుమెంటరీల
నిర్మాతగా, హక్కుల
కార్యకర్తగా
అంతర్జాతీయ గుర్తింపు

న్యూఢిల్లీ: ప్రముఖ డాక్యుమెంటరీ నిర్మాత, సామాజిక కార్యకర్త తపన్ బోస్(78) గురువారం తన ఇంట్లో కన్నుమూశారు. 1970 దశకం నుంచే అంటే ఎమర్జెన్సీ కాలం నుంచే ఆయన సామాజిక కార్యకర్తగా ఉన్నారు. ఆ యన పంజాబ్, జమ్మూకశ్మీర్ మానవ హక్కుల ఉల్లంఘనలపై నిర్భయంగా తన వాదన వినిపించారు. ఆయన యాన్ ఇండియన్ స్టోరీ ఆన్ భాగల్పూర్ బైండింగ్స్(1981), భోపాల్: బియాండ్ జెనోసైడ్(1986), ఝార్ఖండ్ (1993), ది ఎక్స్‌పెండేబుల్ పీపుల్(2016) వంటి గొప్ప డాక్యుమెంటరీలు రూపొందించారు.

దేశభక్తి జాతీయవాదం(జింగోయిస్టిక్ నేషనలిజం), సైనికీకరణ(మిలిటరైజేషన్)లను వ్యతిరేకించే సముదాయాలకు ఆయన మిత్రుడు. ఆయన స్నేహం బలూచిస్థాన్, బర్మ, కశ్మీర్, నాగా, శ్రీలంకలోని తమిళ ఉద్య మం వరకు విస్తరించింది. అప్రజాస్వామిక శక్తులతో పోరాడేందుకు డాక్యుమెంటరీ ఫిల్మ్‌లనే మాధ్యమంగా ఎంచుకున్నారు. తపన్ బోస్ అంత్యక్రియలు శుక్రవారం లోది రోడ్ దహనవాటికలో జరుగనున్నాయి. ఆయనకు భార్య రీటా మన్‌చంద, కూతురు దేవానీ సైనీ ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News