- Advertisement -
హైదరాబాద్: గోషామహల్లో ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ స్థానికులు ఆందోళన చేస్తున్నారు. గోషామహల్ పరిరక్షణ సమితి బంద్కు పిలుపునిచ్చింది. ఉస్మానియా ఆస్పత్రి గోషామహల్ లో నిర్మించొద్దని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పలువురు ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ముందస్తుగా పలువురిని హౌస్ అరెస్ట్ చేశారు. గోషామహల్లో ఉస్మానియా ఆస్పత్రిపై పునరాలోచించాలని బిజెపి ఎంఎల్ఎ రాజాసింగ్ కోరారు. గోషామహల్ గ్రౌండ్లో ఆస్పత్రి కడితే పలు రోగాలు వస్తాయని స్థానికులు భయపడుతున్నారన్నారు. ఆస్పత్రి నిర్మాణంపై స్థానికులతో సిఎం మాట్లాడాలని ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు. శుక్రవారం ఉదయం 11.54కి గోషామహల్లో ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవనానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.
- Advertisement -