Friday, January 31, 2025

ఫిబ్రవరి నుంచి ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ సినిమా

- Advertisement -
- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై దేశ, విదేశాల్లో ఆసక్తి నెలకొంది. కెజిఎఫ్, సలార్ వంటి బ్లాక్‌బస్టర్‌ల తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కించబోయే ఈ సినిమాను 2026 జనవరి 9న విడుదల చేయాలని మేకర్స్ మొదట ప్లాన్ చేశారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటిం గ్ ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్‌లో హృతిక్ రోషన్‌తో కలిసి వార్ 2 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్, నీల్ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తయ్యే దశలో ఉన్నాయి.

సినిమా షూటింగ్‌ను ఫిబ్రవరి నుంచి ప్రారంభించి, అక్టోబర్ లేదా నవంబర్ లో పూర్తిచేయాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ ప్ర శాంత్ నీల్ సినిమా చిత్రీకరణకు ఎక్కువ సమ యం తీసుకుంటాడు. గత చిత్రాల అనుభవాన్ని పరిశీలిస్తే సినిమా పూర్తవడానికి మరో 10, -12 నెలలు పట్టే అవకాశం ఉంది. అందుకే, 2026 సంక్రాంతికి ఈ ప్రాజెక్ట్ రావడం కష్టమేనని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రుక్మిణి వసంత్ కథానాయికగా నటించనున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మలయాళ స్టార్ టోవినో థామస్, బిజు మీనన్‌లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News