Saturday, February 1, 2025

బడ్జెట్‌లో మహిళలు, పేదలు, మధ్యతరగతికి ప్రాధాన్యం : ప్రధాని మోడీ సంకేతాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం వేళ రేపటి బడ్జెట్‌లో పేద, మధ్యతరగతితోపాటు మహిళలకు పెద్దపీట వేస్తారన్న అంచనాలు ప్రధాని మోడీ వ్యాఖ్యల బట్టి తెలుస్తోంది. సంపదకు, పురోగతి వర్ధిల్లేలా పేదలు, మధ్యతరగతిపై మహాలక్ష్మి ప్రత్యేక కటాక్షం చూపించాలని ప్రార్థిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. మహిళలకు సమాన హక్కులు ఉండాలని స్పష్టం చేస్తూ మతపరమైన, వర్గపరమైన విభేదాల నుంచి వారు స్వేచ్ఛగా ఉండాలని ఆకాంక్షించారు. అనుకున్న లక్షాల సాధనకు చెప్పుకోతగిన నిర్ణయాలు బడ్జెట్‌లో ఉంటాయని పేర్కొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సంక్షేమ పథకాలకు కేంద్ర బిందువుగా ఉన్న మహిళలకు తగిన గౌరవం, హోదా ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ బడ్జెట్ సమావేశాల్లో అనేక చారిత్రాత్మక బిల్లులు, ప్రతిపాదనలపై చర్చించడమవుతుందని, అవి చట్టాలుగా రూపొంది, దేశాన్ని మరింత పటిష్టం చేస్తాయని అభిప్రాయం వెలిబుచ్చారు. పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా పేదలు, మధ్య తరగతి ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రస్తావించారు. “ ఈరోజు పేదలు, మధ్యతరగతి , యువత, మహిళలు, రైతులకు అత్యధిక ప్రాధాన్యం కల్పించి అసాధారణమైన వేగంతో తీసుకుంటున్న ప్రధాన నిర్ణయాలకు, విధానాలకు దేశం సాక్షంగా ఉంటోంది.” అని రాష్ట్రపతి ముర్ము పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News