Saturday, February 1, 2025

నాగోబాకు ’సిరి’ కుండల నైవేద్యం

- Advertisement -
- Advertisement -

ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీల ఆరాధ్య దైవంగా కొలిచే నాగోబాకు అభిషేకం చేయాలన్నా … నైవేద్యం సిద్ధం చేయాలన్నా సిరికొండ కుండలనే వాడతారు. ఆదివాసీల అతిపెద్ద జాతరలో ఒకటైన నాగోబా జాతర సంబరాలకు సిరికొండ మండల కేంద్రంలో తయారుచేసే కుండలకు శతబ్దాల బంధం ఉంది. స్థానిక గుగ్గిల వంశస్థులు తయారుచేసిన కుండల వాడకం నాగోబా జాతర మొదలైనప్పటి నుండి నేటివరకు అప్రతిహతంగా కొనసాగుతోంది. అమావాస్యకు మూడు రోజుల ముందు ప్రతి యేటా పుష్యమాసంలో నెలవంక కనిపించగానే నాగోబా జాతర సన్నాహాలు ప్రారంభం అవుతాయి. అమవాస్యకు మూడు రోజుల ముందు మెస్రం వంశీయులు ఎడ్లబండ్లపై సిరికొండలోని గుగ్గిల స్వామి ఇంటికి వెళ్లి కావాల్సిన కుండల తయారీని ప్రారంభించాలని చెప్పి వస్తారు. మరుసటిరోజు నుంచే స్వామి కుటుంబం కుండల తయారీని ప్రారంభిస్తారు. తయారైన వాటిని మహాజాతర ప్రారంభానికి రెండు రోజుల ముందు ఎడ్లబండ్ల పై వచ్చి మెస్రం వంశీయులు ప్రత్యేక పూజలు నిర్వహించి కేస్లాపూర్‌కు తీసుకెళ్తారు.

ఏడు రకాలైన 350 మట్టి పాత్రలు, ఆదివాసీలు వారం రోజుల పాటు నిర్వహించే పూజలకు ఉపయోగించే పెద్ద కుండలు (పెద్ద బాణాలు) ఈ బాణాల్లో గంగను నుంచి తెచ్చిన తయారుచేసిన కుండలు నీటిని పోసి ఉంచుతారు. నీటి కుండలు 55, వాటిపై పెట్టిన మూతలు 55, వీటిని పెద్ద కుండలోంచి నీటిని తీసుకునేందుకు వాడతారు. నీటిని పూజలకు తీసుకునేందుకు 45 ముంతలను వినియోగిస్తారు, దీపాంతలు కుండలను 150 పూజలకు వాడుతారు. పెంకలు 25 ఆదివాసీలు ఆలయ పరిసర ప్రాంతాల్లో పిండి వంటకాలు, నైవేద్యాలు తయారు చేయడాసికి వాడతారు. నాగోబా జాతరకు గుగ్గిల స్వామి కుటుంబ దాదాపుగా 35 ఏళ్లుగా ఈ కుండలను తయారు చేస్తోంది. అంతకముందు గుగ్గిల రాజన్న 70 ఏళ్లు, రాజన్న తండ్రి రాజన్న సైతం 70 ఏళ్లు కుండలను తయారుచేసి ఇచ్చారు. మూడు తరాలుగా గుగ్గిల వంశస్థులు 175 ఏళ్లుగా నాగోబా పూజలకు కుండలు తయారుచేసి ఇవ్వడం ఆనవాయితీగా నేటికీ కొనసాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News