Saturday, February 1, 2025

ఓ ఇంట్లో 8 రోజులుగా మహిళ మృతదేహం

- Advertisement -
- Advertisement -

తూర్పు మండల పరిధిలోని చిలకలగూడ విభాగం వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. వారం రోజుల క్రితం ఒక మహిళ మృతి చెందగా ఆ మృతదేహంతోనే ఇద్దరు కూతుర్లు సహజీవనం చేసిన ఘటన శుక్రవారం కలకలం రేపింది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన కథనం ప్రకారం లలిత(45)అనే మహిళ రెండు నెలల నుండి బౌద్ధనగర్‌లోని ఒక ఇంట్లో తన ఇద్దరు కూతుర్లతో కలసి ఉంటుంది. దాదాపు 5ఏళ్ల క్రితమే లలిత భర్త కుటుంబ కలహాలతో వదిలి వెళ్లిపోయినట్లు తెలిపారు. తన ఇద్దరు కూతుర్లు ప్రైవేట్ ఉద్యోగాలు చేయగా వచ్చిన ఆదాయంతోనే జీవిస్తున్నారు. ఆరోగ్యంగానే ఉన్న లలిత కొద్దిగా మానసిక స్థితి కోల్పోయినట్లు కనిపిస్తుంది, మాట విధానం కూడా అలానే ఉంటుందని ఇంటి యజమాని తెలిపారు. ఈ నెల 23న మృతి చెందింది.

కానీ ఈ విషయం బయటకు పొక్కకుండా కూతుర్లు ఇద్దరు శవంతోనే గడిపారు. పూర్తిగా మానసిక స్థైర్యాన్ని కోల్పోయి వారు కూడా ఆత్మహత్యకు యత్నించారు. చేతులపై కత్తితో కోసుకున్నట్లు ఆనవాలు చూపించారు. శుక్రవారం మళ్ళీ కూతుర్లు వారాసిగూడా పోలీస్ స్టేషన్ కు చేరుకొని పిర్యాదు చేశారు. ఘటనాస్థలికి పోలీసులు చేరుకొని క్లూస్ టీం ను రప్పించి వివరాలు సేకరించారు. ఘటనా స్థలికి ఈస్ట్ జోన్ ఏసిపి జయపాల్ రెడ్డి చేరుకొని వివరాలు సేకరించారు. ఐతే వారం రోజులు కాదు రెండు మూడు రోజుల క్రితమే మృతి చెందినట్లు అనుమానిస్తున్న పోలీసులు. అనుమానాస్పద మృతికింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏసిపి జైపాల్ రెడ్డి తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. మృతురాలి మానసిక స్థితి సరిగా లేదని, ఇంట్లో రెండు కుక్కలను పెంచుకునే వారని తెలిసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News