Saturday, February 1, 2025

భారత్‌కు సిరీస్

- Advertisement -
- Advertisement -

ఇంగ్లండ్‌తో శుక్రవారం జరిగిన నాలుగో టి20లో ఆతిథ్య భారత్ 15 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో టీమిండియా మరో మ్యాచ్ మిగిలివుండగానే 31తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఓపెనర్ సంజు శాంసన్ (1) మరోసారి విఫలమయ్యాడు. తిలక్ వర్మ (0), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (౦) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ (29) పరుగులు చేశాడు. ఇక రింకు సింగ్ 4 ఫోర్లు, ఒక సిక్స్‌తో 30 పరుగులు సాధించాడు.

మరోవైపు శివమ్ దూబె, హార్దిక్ పాండ్యలు అర్ధ సెంచరీలతో జట్టుకు అండగా నిలిచారు. శివమ్ దూబె 7 ఫోర్లు, రెండు సిక్స్‌లతో 53 పరుగులు చేశాడు. హార్దిక్ 4 సిక్సర్లు, మరో నాలుగు బౌండరీలతో 53 పరుగులు సాధించాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 19.4 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్ (23), బెన్ డకెట్ (39) శుభారంభం అందించారు. హారి బ్రూక్ (51) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అయితే కీలక సమయంలో భారత బౌలర్లు పుంజుకుని జట్టును గెలిపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News