2 వేల పడకల సామర్థం,
14 అంతస్తులతో నిర్మాణం
రూ.2700 కోట్ల
రెండేళ్లలో పూర్తి చేయడం లక్షం
రోజుకు ఐదువేల మందికి
ఓ.పి విభాగంలో చికిత్స
మంత్రి రాజనర్సింహ వెల్లడి
మనతెలంగాణ/హైదరాబాద్: నూతనంగా నిర్మించనున్న ఉస్మానియా ఆస్పత్రికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇం దులో భాగంగా గోషామహల్‌లో కొత్త ఉస్మానియా హాస్పిటల్ నిర్మాణానికి సిఎం రేవంత్‌రెడ్డి, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శుక్రవారం ఉదయం శంకుస్థాపన చేశారు. డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క, మం త్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభు త్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, కే.కేశవరావు, మేయ ర్ గద్వాల విజయలక్ష్మీ, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ,రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ తదితరులు ఈ వే డుకలో పాల్గొన్నారు. 2వేల పడకల సామర్ధ్యంతో మొత్తం 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నూతన ఆసుపత్రిని నిర్మించనున్నారు. 26 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించను న్న ఈ నూతన ఆసుపత్రిని కార్పొరేట్ ఆసుపత్రులను తలదన్నేలా నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిం ది. రూ.2400 కోట్లతో 14 అంతస్తుల్లో ఆస్పత్రి భవన ని ర్మాణం జరుగనుంది. కొత్త ఆస్పత్రిలో రోబోటిక్ సర్జరీలు చేసేలా సౌకర్యాలు కల్పించనున్నారు.
ఉస్మానియా పురాతన భవనం శిథిలావస్థకు చేరింది : మంత్రి రాజనర్సింహ
వందేండ్లుగా పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న ఘ న చరిత్ర ఉస్మానియా హాస్పిటల్ సొంతం అని రాష్ట్ర వై ద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వ్యాఖ్యానించారు. వైద్య విద్యకు కూడా ఉస్మానియా ఓ బ్రాండ్ అ ని పేర్కొన్నారు. ఉస్మానియా నూతన ఆస్పత్రి శంకుస్థాప న సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మీడియాతో మాట్లాడారు. ఉస్మానియా డాక్టర్లు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారని అన్నారు. చర్లపల్లికో, మరో ప్రాంతానికో హాస్పిటల్‌ను తీసుకెళ్లాలని కొంత మంది ప్ర తిపాదించారని, కానీ 1919 నుంచి వందేండ్లకుపైగా ఇ క్కడి ప్రజలకు ఉస్మానియాతో అనుబంధం ఉందని, అం దుకే ఈ ప్రాంతంలోనే హాస్పిటల్ పెట్టాలని సిఎం నిర్ణయి ంచారని పేర్కొన్నారు. ఈ ప్రాంత ప్రజలకు ఉస్మానియా ఆస్పత్రితో ఉన్న అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకుని.. ఉస్మానియాకు దగ్గరగా ఉన్న గోషామహల్ స్థలాన్ని హాస్పిటల్ నిర్మాణం కోసం ముఖ్యమంత్రి ఎంపిక చేశారని తెలిపా రు. 26 ఎకరాల 30 గుంటల విశాలమైన ప్రాంగణంలో, 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఉస్మానియా కొత్త హాస్పిటల్‌ను నిర్మిస్తున్నామని వివరించారు.
ప్రస్తుతం ఉ స్మానియా ఆస్పత్రిలో 1168 పడకలు ఉన్నాయని, కొత్త ఉ స్మానియాలో 2 వేల బెడ్లు అందుబాటులో ఉంటాయ ని, ఇందులో 500 బెడ్ల కెపాసిటీతో ఐసియు వస్తుందని అన్నారు. ప్రస్తుత ఉస్మానియాలో 22 డిపార్ట్‌మెంట్లు ఉం డగా, కొత్త హాస్పిటల్‌లో అదనంగా మరో 8 డిపార్ట్‌మెంట్ల ను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.సుమారు 41 ఆ పరేషన్ థియేటర్లు నయా ఉస్మానియాలో అందుబాటులో కి తీసుకొస్తున్నామని, హాస్పిటల్ ప్రాంగణంలోనే డెంటల్, నర్సింగ్, ఫిజియోథెరపీ కాలేజీలు ఉంటాయని పేర్కొనా ్నరు. విద్యార్థులకు, ఫాకల్టీకి అధునాతన వసతులతో కూ డిన హాస్టల్ సదుపాయం, 750 సీట్ల సామర్థంతో ఆడిటోరియం, క్రీడా ప్రాంగణాలు ఉంటాయని, పేషెంట్ల అటెండర్ల కోసం ధర్మశాల నిర్మిస్తున్నామని తెలిపారు. గోషామహల్ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకు నే బాధ్యత ప్రభుత్వానిది అని, ఫైర్ స్టేషన్, విద్యుత్ సబ్‌స్టేషన్, పోలీస్ అవుట్ పోస్ట్ వంటివి హాస్పిటల్ ప్రాంగణంలో ఉంటాయన్నారు. రూ.2700 కోట్లతో ని ర్మించే, ఈ కొత్త ఆస్పత్రిని రెండేండ్లలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామన్నారు. హాస్పిటల్ ప్రారంభమయ్యాక, వ్యాపారాలు పెరుగుతాయన్నారు.