Saturday, February 1, 2025

అమెరికాలో విమానం ప్రమాదం: ఆరుగురు మృతి

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: అమెరికాలో మరో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఫిలడెల్ఫియాలో విమానం కుప్పకూలిపోవడంతో ఆరుగురు మృతి చెందారు. టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే విమానం కూలిపోయింది. విమానం కూలిపోయిన ఘటనలో కార్లు, పలు ఇండ్లు ధ్వంసమయ్యాయి. పోలీసులు, విమానయాన అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేసి శిథిలాలను తొలగిస్తున్నారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ సమీపంలోని రొనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్ పోర్టులో ప్యాసింజర్ విమానం, మిలిటరీ హెలికాప్టర్ ఢీకొనడంతో 67 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News