Saturday, February 1, 2025

సెంచరీ హీరో తన్మయ్‌కు జగన్మోహన్ రావు అభినందనలు

- Advertisement -
- Advertisement -

తన్మయ్‌కు రూ. లక్ష నజరానా
మనతెలంగాణ/ హైదరాబాద్: ప్రస్తుతం జరుగుతున్న రంజీ సీజన్‌లో నాలుగు శతకాలు, రెండు హాఫ్ సెంచరీలతో సాధించిన హైదరాబాద్ ఓపెనర్ తన్మయ్ అగర్వాల్‌ను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సిఎ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్ రావు అభినందించారు. శుక్రవారం నాగపూర్‌లో విదర్భతో జరుగుతున్న ఈ సీజన్ ఆఖరి రంజీ మ్యాచ్‌ను జగన్మోహన్ రావు ప్రత్యక్షంగా వీక్షించారు. హైదరాబాద్ ఆటగాళ్ల ప్రదర్శనను తిలకించి మ్యాచ్ అనంతరం జట్టుతో సమావేశమై వారి ఆటతీరుపై విశ్లేషించారు.

గ్రూప్-బిలో టాపర్‌గా ఉన్న విదర్భపై ఎలాగైనా గెలవాలని సూచించారు. ఈ సీజన్‌లో ఆడిన ఏడు మ్యాచ్ల్లో 84.36 సగటుతో 928 పరుగులు చేసిన తన్మయ్ ను ప్రశంసించారు. తన్మయ్ త్వరలో టీమిండియాలోకి రావాల ని ఆకాంక్షించారు. తన సొంత నిధులు నుంచి రూ.లక్ష నగదు బహుమతిని జగన్మోహన్ రావు ప్రకటించారు. ఇక, ఏడు మ్యా చ్ల్లో 33 వికెట్లు పడగొట్టిన స్పిన్నర్ తనయ్ త్యాగరాజన్ ప్రదర్శననూ కొనియాడారు. ఈ సీజన్ హైదరాబాద్ విజయంతో ముగించాలని, ఆ బాధ్యతను కెప్టెన్ సివి మిలింద్, అంతర్జాతీయ పేసర్ మహ్మద్ సిరాజ్ తీసుకోవాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News