ఢిల్లీ: వచ్చేవారం పార్లమెంట్ ముందకు కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లు ప్రవేశపెడుతామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇన్‌కమ్ ట్యాక్స్‌లో ఉన్న అనవసర సెక్షన్లు తొలగిస్తామని స్పష్టం చేశారు. బిఎన్ఎస్ స్ఫూర్తితో కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లు తీసుకొస్తామని, లిటిగేషన్లు తగ్గించేలా ఇన్‌కమ్ ట్యాక్స్ విధానం ఉంటుందని వివరించారు. లోక్‌సభలో ఎనిమిదోసారి కేంద్ర బడ్జెట్ 2025-26ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగించారు. మిడిల్ క్లాస్ ప్రజలను దృష్టిలో పెట్టుకొని వ్యక్తిగత పన్ను విధానం తీసుకొస్తామని ప్రకటించారు. టిడిఎస్ పై మరింత క్లారిటీ ఇస్తామని, సీనియర్ సిటిజన్స్‌కు టిడిఎస్ మినహాయింపులు ఉంటాయని, రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంచుతామని, అప్‌డేటెడ్ ఇన్‌కమ్ ట్యాక్స్ నమోదుకు సమయం 4 ఏళ్లకు పొడిగిస్తామన్నారు.
స్వయం సహాయక గ్రూపులకు గ్రామీణ్ క్రెడిట్ కార్డులు ఇవ్వడంతో పాటు 6 లైఫ్ సేవింగ్ మెడిసిన్స్‌పై పన్నుల తగ్గిస్తామన్నారు. ఇవి బ్యాటరీ పరిశ్రమలకు ప్రోత్సాహాకాల కోసం క్లీన్‌టెక్ మిషన్ ఏర్పాటు చేస్తామని, మరో 120 రూట్లలో ఉడాన్ పథకం అమలు చేయడంతో పాటు పర్యాటక ప్రాంతాలకు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి 22 పర్యాటక ప్రాంతాల అభివృద్ధి చేస్తామన్నారు. ఇన్సూరెన్స్ రంగంలో వంద శాతం ఎఫ్ డిఐలకు అనుమతి ఉంటుందని, ప్రీమియం మొత్తాన్ని దేశంలోనే పెట్టుబడి పెట్టే విదేశీ సంస్థలకు అనుమతి ఇస్తామని నిర్మలా చెప్పారు.