Saturday, February 1, 2025

కెసిఆర్ కుంభకర్ణుడిలా నిద్రపోతున్నారు: మల్లు రవి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ఏడాదిగా కుంభ కర్ణుడిలానిద్రపోతున్నారని, అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని  కాంగ్రెస్ ఎంపి మల్లు రవి మండిపడ్డారు. కెసిఆర్ వ్యాఖ్యలకు మల్లు రవి రీకౌంటర్ ఇచ్చారు. కెసిఆర్ చెప్పడం కాదు అని జనంలోకి రావాలన్నారు. ప్రతిపక్ష హోదా, కారు ఇచ్చామని ఆయన ఎందుకు బయటకు రారు అని నిలదీశారు. కాంగ్రెస్ పాలనపై బిఆర్ఎస్ వాళ్లే పోల్ పెట్టారని ఆ పోల్లో ఆ పార్టీకే ఎక్కువ ఓట్లు వచ్చాయని కెసిఆర్ అన్నారన్నారు. సోషల్ మీడియా జిమ్మిక్కులతోనే పోల్ ని మార్చారని దుయ్యబట్టారు. ఎంఎల్ సి కవితతోనే ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ లాంటి వారు జైలుకు పోయారని రవి ఎద్దేవా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News