Saturday, February 1, 2025

రక్షణ శాఖకు రూ. 6.81 లక్షల కోట్ల బడ్జెట్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : భారత్ 202526లో రక్షణ రంగ పెట్టుబడి కోసం రూ. 6,81,210 కోట్లను శనివారం కేటాయించింది. ఇది ప్రస్తుత ద్రవ్య సంవత్సరానికి కేటాయించిన రూ. 6.22 లక్షల కోట్ల కన్నా స్వల్పంగా అధికం. వేగంగా మారుతున్న ప్రాంతీయ భద్రత పరిస్థితి దృష్టా సాయుధ బలగాల ఆధునికీకరణపై మళ్లీ దృష్టి కేంద్రీకరించిన నేపథ్యంలో ఈ కేటామించడమైంది. మూలధన వ్యయం కోసం మొత్తం రూ. 192387 కోట్లు కేటాయించారు. కొత్త ఆయుధాలు, విమానాలు, యుద్ధ నౌకలు, ఇతర మిలిటరీ హార్డ్‌వేర్ కొనుగోలుకు దీనిని ప్రధానంగా వినియోగిస్తారు. 202425లో మూలధన వ్యయం రూ. 1.72 లక్షల కోట్లు. సవరించిన అంచనాలు రూ. 159500 కోట్లు. అంటే సుమారు రూ.3500 కోట్ల మొత్తాన్ని ఇంకా ఖర్చు చేయలేదన్న మాట.

వచ్చే ద్రవ్య సంవత్సరానికి దైనందిన నిర్వహణ ఖర్చులు, జీతాల కోసం అయ్యే రెవెన్యూ వ్యయాన్ని రూ. 488822 కోట్లుగా లెక్కించారు. దీనిలో పింఛన్ల కోసం రూ. 160795 కోట్లు మొత్తం చేరి ఉంది. రక్షణ బడ్జెట్ కోసం కేటాయింపును 202526లో జిడిపిలో 1.91 శాతంగా అంచనా వేశారు. విమానాలు, ఏరో ఇంజన్ల కోసం క్యాపిటల్ వ్యయం కింద రూ. 48614 కోట్లు, నౌకా దళ నౌకల కోసం రూ. 24390 కోట్లు కేటాయించారు. ఇతర పరికరాల కోసం రూ. 63099 కోట్లను ప్రత్యేకించారు. నావల్ డాక్‌యార్డ్ ప్రాజెక్టుల కోసం విడిగా రూ. 4500 కోట్లు కేటాయించారు. 202425లో ప్రభుత్వంరక్షణ శాఖ బడ్జెట్ కోసం రూ. 621940 కోట్లు కేటాయించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News