Sunday, February 2, 2025

జనగణన, జాతీయ జనాభా నమోదుకు రూ.574 కోట్లు

- Advertisement -
- Advertisement -

దేశంలో జనగణన, జాతీయ జనాభా నమోదుకు బడ్జెట్‌లో రూ.574 కోట్లు కేటాయించారు. 20212022లో జనగణన కోసం రూ. 3768 3768 కోట్లు ప్రతిపాదించినా, ఆ దిశగా అడుగులు పడలేదు. 20232024 బడ్జెట్‌లో జనాభా లెక్కల కోసం కేవలం రూ. 578.29 కోట్లు మాత్రమే కేటాయించారు. తాజా బడ్జెట్‌లో ఈ మొత్తాన్ని కాస్త పెంచినప్పటికీ జనగణన అంచనా వ్యయం కంటే ఇది చాలా తక్కువ కావడం గమనార్హం. జాతీయ రహదార్ల శాఖకు రూ. 2.87 లక్షల కోట్లు
రోడ్డు రవాణా, జాతీయ రహదార్ల మంత్రిత్వశాఖకు కేంద్ర బడ్జెట్‌లో రూ. 2,87, 333.16 కోట్లు కేటాయించారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ. 2,805,18.80 కోట్లు కేటాయించగా, అంతకన్నా ఇప్పుడు 2.41 శాతం ఎక్కువగా కేటాయించడమైంది. రాష్ట్ర ప్రభుత్వాల అధీనం లోని జాతీయ రహదార్లకు కూడా కేటాయింపులు పెరిగాయి. గత ఏడాది 1,693,71కోట్లు కేటాయించగా, ఇప్పుడు రూ. 1, 878,03 కోట్లు కేటాయించడమైంది. సిబిఐకి రూ. 1,071 కోట్లు కేటాయింపుబడ్జెట్‌లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ)కు రూ. 1,071.05 కోట్లు కేటాయించడమైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేటాయిపు కన్నా రూ. 84.12 కోట్లు ఎక్కువ. 202425 బడ్జెట్ అంచనాలో సిబిఐకి రూ. 954.46 కోట్లు ప్రతిపాదించగా, తరువాత రూ. 986.93 కోట్లకు సవరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News