Sunday, February 2, 2025

గిగ్ కార్మికులకు ఐడి కార్డులు, ఈశ్రమ్ పోర్టల్ రిజిస్ట్రేషన్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: గిగ్ కార్మికులకు సాయపడేందుకుగాను ఐడి కార్డులు, ఈశ్రమ్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం తెలిపారు. పట్టణాలలోని కార్మికుల ఆర్థిక, సామాజిక స్థాయిని పెంచేందుకు కూడా ఈ స్కీమ్‌ను అమలుచేయనున్నట్లు ఆమె వివరించారు. ‘…ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల గిగ్ వర్కర్లు న్యూ ఏజ్ సర్వీసెస్ ఎకనామీకి మహా చైతన్యాన్ని అందిస్తారు. వారి సహకారాన్ని గుర్తించి, మా ప్రభుత్వం వారికి గుర్తింపు కార్డులు, ఈశ్రమ్ పోర్టల్‌లో వారి పేర్ల నమోదుకు ఏరాట్లు చేస్తోంది’ అన్నారు.

అంతేకాక వారికి ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన(పిఎంజెఎవై) క్రింద ఆరోగ్య వసతులు కల్పించనున్నట్లు ఆమె తెలిపారు. ఇదే సందర్భంలో నిర్మలా సీతారామన్ వచ్చే ఏడాది మెడికల్ కాలేజ్‌లు, ఆసుపత్రులలో 10000 సీట్లు, రాగల ఐదేళ్లలో 75000 సీట్లను అదనంగా ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ఇంతేకాక వచ్చే మూడేళ్లలో ప్రభుత్వం అన్ని జిల్లా ఆసుపత్రులలో డేకేర్ క్యాన్సర్ సెంటర్లను ఏర్పాటుచేయబోతున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News