మన తెలంగాణ/హైదరాబాద్ : బడ్జెట్‌లో తెలంగాణ కు జరిగిన అన్యాయంపై సిఎం ఆగ్రహం వ్యక్తం చే శారు. ‘కేంద్ర ప్రభుత్వాన్ని మనం అడిగింది ఏంటి? వాళ్లు ఇచ్చింది ఏంటి?’ అని సిఎం రేవంత్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కె. రేవంత్ రెడ్డి నేతృత్వంలో శనివారం ఉదయం మంత్రులతో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశం బంజారాహిల్స్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో ని ర్వహించారు. రాష్ట్ర, కేంద్ర బడ్జెట్, రాష్ట్ర ప్రతిపాదన లు, తదితర అంశాలపై సిఎం సమీక్ష నిర్వహించా రు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అనుసరించాల్సిన ఆర్థికపరమైన విధానాలు, పథకాల ప్రాధాన్యతపై సిఎం చర్చించారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు సంబంధించి ప్రధానమైన అంశాలను,
రాష్ట్రం గమనించాల్సి న ప్రతిపాదనలు, అలాగే గడిచిన ఆర్థిక సంవత్సరం లో రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక ప్రణాళికల గు రించి సిఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. దీంతోపాటు రాష్ట్ర మంత్రుల జాబితా, పరిశ్రమలు, గ్రామీణాభివృద్ధి, విద్య, ఆరోగ్య, రవాణా, వ్యవసా యం వంటి పలు రంగాలపై సిఎం రేవంత్ చర్చించా రు. రాష్ట్ర ప్రభుత్వ విధానా లను పరిగణనలోకి తీసుకొని, ప్రభుత్వం అవసరమైన రుణాల కోసం చర్చించారు. ఈ సమావేశం అనంతరం, మంత్రులు తమ శాఖల సమస్యలను ప్రభుత్వానికి సమర్పించనున్నా రు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఇక్కడ చర్చించిన ప్రతిపాదనలు, కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపుల కోసం మంత్రులు అవసరమైన సూచనలను ఈ సమావేశం లో అందించారు. సమావేశం రాష్ట్ర ఆర్థిక వ్యూహాన్ని మెరుగుపరచడానికి కీలకమయ్యిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు, అధికారులతో పేర్కొన్నారు.
పార్టీ, ప్రభుత్వం సమన్వయంతో పని చేయాలి
ఎమ్మెల్సీ, పంచాయతీ ఎన్నికలపై మంత్రులతో సిఎం చర్చించారు. పార్టీ, ప్రభుత్వంతో సమన్వయంతో పని చేయాలని, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలకు గ్యాప్ లేకుండా చూసుకోవాలని సిఎం వారికి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రచారంపై స్పీడ్ పెంచడంతోపాటు ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టే విషయంలో ప్రణాళికతో వెళ్లాలని సిఎం వారికి దిశానిర్దేశం చేశారు.
ఇంటర్ బోర్డుపై ముఖ్యమంత్రి సీరియస్..
రాష్ట్రంలో ఇంటర్ బోర్డు వర్సెస్ ప్రైవేటు జూనియర్ కాలేజీల వ్యవహారంపై ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. పరీక్షల సమయంలో ఇదేం పంచాయతీ అని అధికారులపై ఆయన మండిపడ్డారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని ఉన్నతాధికారులను సిఎం ఆదేశించారు. దీంతో ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య ప్రైవేటు కాలేజీలతో చర్చలు జరిపి ప్రాక్టికల్ ఎగ్జామ్స్‌కు సెంటర్లు ఇవ్వాలని కోరారు. ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్ హాల్‌లో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని బోర్డు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ నిర్ణయాన్ని కొన్ని ప్రైవేటు కాలేజీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తమ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుంటే వార్షిక పరీక్షలకు
కాలేజీలను ఎగ్జామ్ సెంటర్‌లుగా ఇవ్వబోమని తెలంగాణ ప్రైవేటు జూనియర్ కాలేజీల యాజమాన్యాల సంఘం తేల్చిచెప్పింది. రెండు రోజుల్లో ప్రాక్టికల్ పరీక్షలు జరుగనున్నాయి. అయితే, ఇప్పటివరకు ఇంటర్ బోర్డు హాల్ టికెట్లు వెబ్‌సైట్‌లో పెట్టలేదు. దీంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో సిఎం స్పందించి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సిఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్ రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీతక్క, ఇతర మంత్రులు పాల్గొన్నారు.