అసంతృప్తి మీటింగ్ కాదు..
అభివృద్ధి నిధుల కోసమని స్పష్టం
తాము వెళ్లలేదని కొందరు,
వెళ్లితే తప్పేంటన్న మరి కొందరు
మన తెలంగాణ/హైదరాబాద్: అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొందరు శుక్రవారం రాత్రి రహస్య భేటీ అయ్యారన్న సమాచారం రాజకీయవర్గాలలో కలకలం సృష్టించింది. అయితే భేటీ వాస్తవం అయినప్పటికీ చివరికి అది టీకప్పులో తుఫానుగా తేలిపోయింది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలోని యోజకవర్గాల అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రిని ఒక బృందంగా వెళ్లి అడిగేందుకే తాము సమావేశం అయినట్టు వారు స్పష్టం చేయగా, మరికొందరు ఎమ్మెల్యేలు మాత్రం ఆ సమావేశానికి తాము వెళ్లకపోయినా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జ రుగుతుందని తీవ్రంగా ఖండించారు. ఈ ఉదంతం వివరాలలోకి వెళితే, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరూధ్‌రెడ్డి పార్టీకి చెందిన కొందరు సహచర ఎమ్మెల్యేలకు శుక్రవారం ఫోన్ చేసారు. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నియోజకవర్గాల అభివృద్ధి పనులకు అధిక నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రిని అడిగేందుకు విడివిడిగా కాకుండా ఒక బృందంగా వెళ్లి అడిగితే బాగుంటుంది,
ఎప్పుడు వెళ్దాం.. ఏమేమి అడుగుదామనే అంశంపై చర్చించుకునేందుకు రాత్రికి డిన్నర్‌లో కలుద్దామని పిలిచారు. దీనికి అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు హజరయ్యారు. వాస్తవంగా జరిగింది ఇదే, అయినప్పటికీ కొందరు మంత్రులకు వ్యతిరేకంగా రహస్య భేటీ జరిగినట్టు దుష్ప్రచ్రారం చేస్తున్నారని సమావేశానికి హాజరైన వారు, ఆహ్వానం అందుకున్న వారు ఖండిస్తున్నారు. ఈ సమావేశానికి వెళ్లిన వారిలో వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి కూడా ఉన్నట్టు ప్రచారం జరిగింది. ఈ భేటీ పై ఆయన స్పందిస్తూ, తనకు కూడా అనిరూధ్‌రెడ్డి ఫోన్ చేసి ఆహ్వానించారని, స్థానిక ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసం బృం దంగా వెళ్లి ముఖ్యమంత్రిని అడుగుదామని చెప్పారని అన్నారు. అయితే తన నియోజకవర్గానికి నిధుల సమస్య లేకపోవడంతో ఆ సమావేశానికి వెళ్లిలేదని, శుక్రవారం సాయంత్రం రవీంధ్రభారతిలో జరిగిన గద్దర్ జయంతి సమావేశానికి వెళ్లి అటునుంచి సీఎం రేవంత్‌రెడ్డి వెంట వారి ఇంటికి వెళ్లి రాత్రి 11 గంటలవకు అక్కడే ఉన్నానని చెప్పారు.
వాస్తవం ఇలా ఉంటే రహస్య భేటీలో తాను కూడా ఉన్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఖండించారు. అయినా నిధులు అడిగేందుకు సీఎంను కలుద్దామంటే తప్పేంటి అని ఆయన ్ర పశ్నించారు. అయినా పిలిచింది తమ పార్టీ ఎమ్మెల్యేనే, ఏ బీజేపో, బీఆర్‌ఎస్సో ఎమ్మెల్యే కాదుకదా అని ప్రశ్నించారు. ఇలా ఉండగా ఈ రహస్య భేటీకి వెళ్లినట్టు ప్రచారం జరిగిన ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య స్పందిస్తూ, శుక్రవారం తాను ఎక్కడికీ వెళ్లలేదని, నియోజకవర్గంలో ఉన్నానంటూ ఖండించారు. జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మికాంతరావు స్పందిస్తూ, తాను రెండు రోజులుగా ఢిల్లీలోనే ఉన్నానంటూ సాక్షం చూపుతూ, ఏఐసీసీ కార్యాలయం ఎదుట నిలుచొని సెల్ఫీ వీడియో తీసి మీడియాకు విడుదల చేసారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కు చెందిన మరొక ఎమ్మెల్యే మదుసూధన్‌రెడ్డి (దేవరకద్రా) స్పందిస్తూ, కాంగ్రెస్ ఎమ్మెల్యేల రహస్య భేటీ ప్రచారం అబద్ధమని ఖండించగా, ఇదే జిల్లాకు చెందిన మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి కూడా ఖండించారు. అసలు అలాంటి భేటీ ఏది జరుగలేదని అన్నారు. పార్టీ, ప్రభుత్వ నాయకత్వంపై తమకు ఎలాంటి అసంతృప్తి లేదని ఆయన ఖండించారు.
10 మంది కాదు.. 8 మందిదే : మల్లు రవి
కాంగ్రెస్ ఎమ్మెల్యేల భేటీ జరిగింది వాస్తవమే అయినప్పటికీ అది డిన్నర్ సందర్భంగా అని నాగర్‌కర్నూల్ ఎంపి డాక్టర్ మల్లు రవి స్పష్టం చేసారు. ఈ అంశంపై ఢిల్లీలో రవి స్పందిస్తూ మీడియాతో మాట్లాడారు. డిన్నర్‌లో కలిసింని 10 మంది ఎమ్మెల్యేలు కాదని 8 మంది మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లో కోహినూర్ హోటల్‌లో ఆ డిన్నర్ జరిగిందని కూడా మల్లు వెల్లడించారు. మా ఎమ్మెల్యేలు కలిసి భోజనం చేస్తే తప్పేంటీ అని ఆయన ్ర పశ్నించారు.
యన ్ర పశ్నించారు.