2001లో ప్రారంభమై 2014లో రాష్ట్రసాధన వరకు కొనసాగిన ఉద్యమానికి నాయకత్వం వహించిన కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూడా డీల్ మాంజా, ఖీంచ్ మాంజా రాజకీయాల్ని బాగా అనుసరించారు. ఉద్యమాన్ని ఎప్పుడు ఉర్రూత లూగించాలో, ఎప్పుడు దాన్ని స్తబ్దతలోకి తీసుకు పోవాలో చంద్రశేఖరరావుకు బాగా తెలుసు. ఆయన అనుసరించిన ఎత్తుగడల కారణంగానే తెలంగాణ రాష్ట్రసాధన ఉద్యమం అంత సుదీర్ఘ కాలం కొనసాగ గలిగింది అనడంలో ఎవరికీ సందేహం ఉండనవసరం లేదు.
‘నేను కొడితే మామూలుగా ఉండదు, ఎలా కొడతానో కాంగ్రెస్ నాయకులకు తెలుసు’ అన్నారు కెసిఆర్. ఆ మాటలకు అక్కడ కూర్చున్న వాళ్ళు చప్పట్లు కొట్టి ఉండవచ్చు కానీ ప్రజలు దాన్ని వీరత్వం కిందకు తీసు కుంటారు అనుకుంటే పొరపాటు. మీరు కొట్టడం అంటే ఎమ్మెల్యేలను కొనుక్కోవడమా? మంత్రులతోసహా ఎవ రికీ అందుబాటులో లేకుండా పోవడమా? పదేళ్ల కాలంలో ఏనాడూ సచివాలయం మొహం చూడకపోవడమా? పౌరహక్కుల ప్రజా స్వామిక ఉద్యమాలను
‘మన హయాంలో ఎంతో అభివృద్ధి జరిగింది. చూడు, ఇప్పుడు భూముల ధరలు పూర్తిగా పడిపోయాయి, ఎకరానికి కోటి రూపాయలు ఉండేది ఇప్పుడు 50 లక్షలు కూడా పలకడం లేదు’ అని కెసిఆర్ మాట్లాడారు. అభివృద్ధి అంటే ఏమిటి? భూముల ధరలు ఇబ్బడిముబ్బడిగా పెరగడమే అభివృద్ధి అనుకోవాలా?
సంక్రాంతికి ఎగురవేసే పతంగుల ఆటలో పేంచ్ అనే ఘట్టం ఒకటి ఉంటుంది. ఆకాశంలో రెండు పతంగులు కొట్లాడుకుంటాయన్నమాట పేంచ్ అంటే. పతంగులు ఎగురవేయడానికి ఉపయోగించే దారం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి సాదీ రెండు మాంజా. అవతలివాడి పతంగును కొయ్యాలంటే మాంజా ఉపయోగపడుతుంది. అవతలివాడి పతంగిని ఓడించడానికి రెండు పద్ధతులుంటాయి. ఒకటి డీల్ మాంజా. రెండు ఖీంచ్ మాంజా. దారం డీల్ అంటే వదులుతూపోతే అవతలివాడి పతంగి కట్ అవుతుందా లేక ఖీంచ్ అంటే లాగితే అవతలివాడి పతంగి కట్ అవుతుందా అనేది వాడిన మాంజాను బట్టి ఉంటుంది. ఇప్పుడు ఈ పతంగుల పురాణం ఎందుకు అనుకోవచ్చు ఎవరైనా.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన 1969 ఉద్యమంలో ఆనాటి ఉద్యమ నాయకుడు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తరచూ ఈ పతంగుల భాష వాడుతుండేవారు. నావి డీల్ మాంజా, ఖీంచ్ మాంజా రాజకీయాలు అనేవారు ఆయన. ఉద్యమాన్ని పతంగులు ఎగరవేయడంతో పోల్చుతూ చెన్నారెడ్డి రాజకీయాల్లో పట్టువిడుపులు ఎలా ఉండాలో చెప్పడంకోసం పతంగుల ఆటను ఉదహరించేవారు. ఆయనే ఈ ఖీంచ్ మాంజా,- ఢీల్ మాంజా రాజకీయాలను బాగా ప్రచారంలోకి తెచ్చారు.
ఆ తర్వాత కాలంలో అంతకంటే ఉధృతంగా 2001లో ప్రారంభమై 2014లో రాష్ట్రసాధన వరకు కొనసాగిన ఉద్యమానికి నాయకత్వం వహించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా ఈ డీల్ మాంజా, ఖీంచ్ మాంజా రాజకీయాల్ని ఆ మాట అనకుండానే బాగా అనుసరించారు. ఉద్యమాన్ని ఎప్పుడు ఉర్రూతలూగించాలో, ఎప్పుడు దాన్ని స్తబ్దతలోకి తీసుకుపోవాలో చంద్రశేఖరరావుకు బాగా తెలుసు. ఆయన అనుసరించిన ఎత్తుగడల కారణంగానే తెలంగాణ రాష్ట్రసాధన ఉద్యమం అంత సుదీర్ఘకాలం కొనసాగగలిగింది అనడంలో ఎవరికీ సందేహం ఉండనవసరం లేదు.
రాష్ట్రసాధన అనంతరం 2014 నుంచి దాదాపు తొమ్మిదిన్నర సంవత్సరాలపాటు అధికారంలో ఉన్న చంద్రశేఖరరావు ఓటమి చవిచూసిన తర్వాత ఈ 14 నెలల కాలంలో బయటకు రాకుండా ఉండిపోవడం కూడా ఈ డీల్ మాంజా, ఖీంచ్ మాంజా రాజకీయాల ఎత్తుగడలో భాగమే అని చాలామంది నమ్ముతున్నారు. ఈ 14 మాసాల కాలంలో అధికార పక్షం ఎన్ని సవాళ్లు విసిరినా, ఎంత రెచ్చగొట్టినా ఆయన చలించలేదు. ఒక్కసారి కూడా శాసనసభ సమావేశాలకు హాజరు కాలేదు. అయితే ఆయన సమకాలీన రాజకీయ పరిణామాలను గమనించడం లేదు అనుకుంటే పొరపాటు. ఆయన కాకలుతీరిన రాజకీయ నాయకుడే. అందులో సందేహం ఎవరికీ అవసరం లేదు. ఓడిపోయిన మరునాటి నుంచే ప్రజల్లోకి వచ్చి తన శక్తియుక్తులను ఖర్చు చేయడంకంటే కొంతకాలం మౌనంగా వేచిఉండడమే మంచిది అనుకున్నారు. అది మంచిదే, ప్రజలు ఓడించిన రెండో రోజునుంచే అధికారంలోకి వచ్చిన వాళ్ళను తిడుతూ తిరగడంకంటే కొంతకాలం మౌనంగా ఉండి పరిస్థితుల్ని అర్థం చేసుకోవడం విజ్ఞత గల ఏ రాజకీయ నాయకుడైనా చేయవలసిన పని.
అయితే ఇక్కడ రెండు విషయాలు మాట్లాడుకోవాలి. ఓడిపోగానే గెలిచినవాళ్ళని విమర్శించడం మొదలుపెట్టడం సరైనది కాదు, నిజమే. కానీ ప్రజాక్షేత్రంలోకి వెళ్లకుండా, ప్రజలను కలుసుకోకుండా పూర్తిగా దూరంగా ఉండిపోవడం కూడా సరైనది కాదు అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఆయన ప్రత్యక్షంగా ప్రజాక్షేత్రంలోకి రాకపోయినా ఆయన పార్టీ భారత రాష్ట్ర సమితికి సంబంధించిన ఇతర నాయకులు ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే ఉన్నారు కదా అని చంద్రశేఖరరావు రాజకీయాలను సమర్థించే వారు చెప్పొచ్చు. కానీ ఎంతమంది, ఎంత పని చేస్తున్నా కూడా భారత రాష్ట్ర సమితి వంటి ప్రాంతీయ పార్టీలకు అధినాయకుడు ఒక్కరే ఉంటారు.
ఆయనతోనే ప్రేరణ పొందుతారు, మిగతా ఎంతమంది రెండవ శ్రేణి నాయకులు కష్టపడి పనిచేస్తున్న కూడా. జాతీయ పార్టీల పరిస్థితి అలా ఉండదు.. ఎంతమంది కృష్ణులైనా సిద్ధంగా ఉంటారు.శుక్రవారం నాడు ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో జహీరాబాద్ నుంచి వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో చంద్రశేఖరరావు మాట్లాడిన తీరు ఇక ఆయన ఖీంచ్ మాంజా రాజకీయాలు మొదలు పెట్టాలనుకుంటున్నారని అనిపించే విధంగా ఉన్నది. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి, దాదాపు దశాబ్దకాలం పరిపాలన అనుభవం కూడా కలిగిన చంద్రశేఖరరావు మళ్లీ ప్రజాక్షేత్రంలోకి రావడం మంచిదే. వచ్చేముందు ఈ 14 మాసాల కాలంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను పూర్తిగా అవగాహన చేసుకుని ఉంటారనే అనుకుంటారు అందరూ. అదొక్కటే కాదు, తాము పరిపాలించిన కాలంలో జరిగిన వ్యవహారాలు, ఓటమికి దారితీసిన పరిస్థితులు మళ్లీ ప్రజల మన్నన పొందడానికి చేయవలసిన పనులు ఇట్లాంటి వాటన్నిటి గురించి ఈ 14 మాసాల కాలంలో ఆయన తీవ్రమైన మేధోమథనం చేసి ఉంటారు అనే అందరూ అనుకుంటారు.
అయితే అలా ఆలోచించేవాళ్లు శుక్రవారంనాటి చంద్రశేఖరరావు ప్రసంగం వినాలి. వింటే ఆయన అటువంటి కసరత్తులేవీ చెయ్యలేదని స్పష్టంగా అర్థం అవుతుంది. 2023లో భారత రాష్ట్ర సమితి ఓడిపోయిన తొలిరోజుల్లో ఆ పార్టీకి సంబంధించిన ఒక సీనియర్ నాయకుడు ఒక సోషల్ గ్యాదరింగ్ లో ‘రాష్ట్రాన్ని సాధించి, పదేళ్ల కాలంలో మేము ఇన్ని కార్యక్రమాలు చేస్తే ఎందుకు ఓడిపోయినట్టు?’ అన్నప్పుడు చుట్టూచేరిన వాళ్లనుంచి ఠక్కున వచ్చిన సమాధానం ‘మీకు పబ్లిక్ కనెక్ట్ పోయింది’ అని. ‘అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి అయినా సరే చంద్రశేఖరరావును ప్రజలు ఉద్యమ నాయకుడిగా చూస్తారు తప్ప ప్రగతిభవన్ కట్టుకొని చివరికి మంత్రులకు కూడా అందుబాటులోకి రాని పరిస్థితి వస్తే ఎట్లా సహిస్తారు? అందుకే ఓడించారు మిమ్మల్ని’ అని చెప్పారు అక్కడ అందరూ. ఈ విషయంలో చంద్రశేఖరరావు ఆత్మవిమర్శ పక్కన పెట్టి కనీసం సమీక్ష అయినా చేసుకున్నట్లు లేరు.
తులం బంగారం ఇస్తానన్నందుకు, వడ్డాణం చేయిస్తాం అన్నందుకు ప్రజలు అత్యాశకు పోయి కాంగ్రెస్‌కు ఓటు వేశారు అన్న పద్ధతిలోనే ఆయన మాట్లాడారు. ‘నేను కొడితే మామూలుగా ఉండదు, ఎలా కొడతానో కాంగ్రెస్ నాయకులకు తెలుసు’ అన్నారు ఆయన. ఆ మాటలకు అక్కడ కూర్చున్న వాళ్ళు చప్పట్లు కొట్టి ఉండవచ్చు కానీ ప్రజలు దాన్ని వీరత్వం కిందకు తీసుకుంటారు అనుకుంటే పొరపాటు. మీరు కొట్టడం అంటే ఎమ్మెల్యేలను కొనుక్కోవడమా? మంత్రులతోసహా ఎవరికీ అందుబాటులో లేకుండా పోవడమా? పదేళ్ల కాలం లో ఏనాడూ సచివాలయం మొహం చూడకపోవడమా? పౌరహక్కుల ప్రజాస్వామిక ఉద్యమాలను అనుమతించకపోవడమా? అని ప్రశ్నిస్తారు.
శుక్రవారంనాటి సమావేశంలో ఆయన ఇంకొక మాట అన్నారు. ‘మన హయాంలో ఎంతో అభివృద్ధి జరిగింది. చూడు, ఇప్పుడు భూముల ధరలు పూర్తిగా పడిపోయాయి, ఎకరానికి కోటి రూపాయలు ఉండేది, ఇప్పుడు 50 లక్షలు కూడా పలకడం లేదు’ అని మాట్లాడారు. అభివృద్ధి అంటే ఏమిటి? భూముల ధరలు ఇబ్బడిముబ్బడిగా పెరగడమే అభివృద్ధి అనుకోవాలా? చంద్రశేఖరరావు ఒకప్పటి గురువు చంద్రబాబునాయుడు ఇటువంటి మాటలే మాట్లాడుతుంటారు. సంపద సృష్టించడం తనవల్ల మాత్రమే అవుతుంది అని చెప్పుకునే క్రమంలో హైటెక్ సిటీ దగ్గర లక్ష రూపాయలకు ఎకరం ఉన్న భూమి ఇప్పుడు 100 కోట్లకు ఎకరం అయింది అని చెప్తుంటారు. అదంతా తాను సృష్టించిన సంపద అంటారు. దీనివల్ల సామాన్య ప్రజలకు ఒరిగిందేమిటి అనేది ప్రశ్న. అభివృద్ధి అంటే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటం అన్న విషయం మన రాజకీయ నాయకులు ఎప్పుడో మర్చిపోయారు.
సరే ఇప్పుడు మళ్ళీ చంద్రశేఖరరావు ప్రజాక్షేత్రంలోకి రావడం గురించి మాట్లాడుకుంటే ఆయనే స్వయంగా రంగంలోకి దిగక తప్పని పరిస్థితులు నెలకొంటున్నాయి. భారత రాష్ట్ర సమితిని పూర్తిగా బలహీనపరిచి ఆ స్థానంలోకి తాను వచ్చి తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకునే ప్రయత్నంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఒక అంశంలో మాజీ ముఖ్యమంత్రి కుమారుడు కెటి రామారావు మీద ఎసిబి కేసు పెట్టగానే ఆ వెనకాలే ఈడీని ప్రయోగించింది.
ఇప్పటికే ఆయన కుమార్తె కవిత ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆ కేసులో ఆమె అయిదు మాసాలు జుడీషియల్ రిమాండ్‌లో తీహార్ జైలులో ఉండి బెయిల్ మీద విడుదల అయి ఇప్పుడిప్పుడే తిరిగి క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్న సమయంలో కేరళ మద్యం కుంభకోణంలో ఆమె పాత్ర ఉందంటూ అక్కడి కాంగ్రెస్ పక్షం ఆరోపణలు చేసింది. పాలక్కాడ్ ప్రాంతంలో ఏర్పాటయిన ఒక కంపెనీ ఒయాసిస్‌కు మద్యం తయారీ కాంట్రాక్టు ఇప్పించడంలో ఆమె పాత్ర ఉందని, అక్కడి ముఖ్యమంత్రి పినరయి విజయన్, అబ్కారీ మంత్రి కలిసి మంత్రివర్గ ఆమోదం లేకుండా కవిత కోరిక మేరకు ఈ పని చేశారని కేరళ ప్రతిపక్ష నాయకుడు రమేశన్ ఆరోపించారు. కేరళ ప్రభుత్వం నుండి వివరణ ఏమీ వచ్చినట్టు లేదు కానీ కవిత మాత్రం ఈ వార్తను ఖండించారు. కేరళలో అధికారంలో ఉన్న మార్క్సిస్ట్ పార్టీ, కవిత ప్రాతినిథ్యం వహిస్తున్న బిఆర్‌ఎస్ రెండూ కేంద్రంలోని బిజెపితో పొసగని పార్టీలే. కాంగ్రెస్ చేసిన ఆరోపణలను కేంద్రం సీరియస్‌గా ఎందుకు తీసుకుంటుంది అనుకోడానికి వీల్లేదు. తెలంగాణలో ఫార్ములా ఈ- కార్ రేస్ కేసు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. ఈడీ రంగంలోకి దిగలేదా? కేరళలో మాత్రం పట్టించుకోదని ఎందుకు అనుకోవాలి?
కెసిఆర్ శుక్రవారంనాడు జహీరాబాద్ పార్టీ నాయకులను ఉద్దేశించి మాట్లాడినప్పుడు ‘ప్రాజెక్టుల నిర్మాణాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మూలనపెట్టింది కాబట్టి వాటి సాధనకోసం ఉద్యమం చెయ్యాలి, ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి మళ్ళీ మనమే అధికారంలోకి వచ్చి వాళ్ళను కాపాడాలి’ అన్నారు. ఆయన మరి కొంతకాలం ఈ ప్రభుత్వ పనితీరును గమనించేందుకు వేచి చూసే పరిస్థితులు లేకుండాపోవడానికి అవి మాత్రమే కారణాలు కావని అర్ధం అవుతున్నది. ‘నేను కొడితే మామూలుగా ఉండదు’ అన్న కెసిఆర్ మాటలకు జవాబుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘ముందు నువ్వు చక్కగా నిలబడు, అప్పుడు చూద్దాం’ అన్న స్పందనను కెసిఆర్ ఎలా స్వీకరిస్తారో చూడాలి. ముఖ్యమంత్రి సవాలును స్వీకరించి శాసనసభకు కూడా వెళ్తారా? ఏది ఏమయినా, ఎవరు అవతలిపక్షం పతంగిని కోస్తారు? ఎవరు మిగిలిపోయిన దారాన్ని చరకాకు చుట్టుకుని ఇంటిదారి పడతారు? అనే విషయం తేలేది నాలుగేళ్ల తరువాతే.