- Advertisement -
నేడు సౌతాఫ్రికాతో తుదిపోరు
మహిళల అండర్19 వరల్డ్‌కప్
కౌలాలంపూర్: వరుస విజయాలతో ఫైనల్‌కు చేరుకున్న టీమిండియా ఆదివారం సౌతాఫ్రికా మహిళలతో జరిగే అండర్19 టి20 వరల్డ్‌కప్ ఫైనల్ సమరానికి సమరోత్సాహంతో సిద్ధమైంది. వరుస విజయాలతో ఫైనల్‌కు చేరుకున్న తుది పోరులోనూ ఆధిపత్యం చెలాయించాలనే పట్టుదలతో ఉంది. ఫైనల్‌కు చేరే క్రమంలో ఇంగ్లండ్ వంటి బలమైన జట్టును అలవోకగా ఓడించింది. సౌతాఫ్రికా మ్యాచ్‌లోనూ విజయమే లక్షంగా పెట్టుకుంది. తెలుగు అమ్మాయి గొంగడి త్రిషి జోరుమీదుంది. పరుణిక, వైష్ణవి, ఆయూషి వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు జట్టులో ఉన్నారు. అంతేగాక త్రిష, సానికా చల్కె, కమిలిని, కెప్టెన్ నికి ప్రసాద్ తదితరులతో బ్యాటింగ్ కూడా బలంగా ఉంది. దీంతో భారత్ ఫైనల్లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
- Advertisement -