ముంబయి: బాలీవుడ్‌లో స్టార్ హీరోల సినిమాలలో పూజాహెగ్డే నటిస్తున్నారు. పూజాహెగ్డే నటించిన ‘దేవా’ చిత్రం పేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా నటుడు షాహిద్ కపూర్‌తో కలిసి ఆమె ఇంటర్యూలో పాల్గొన్నారు.
‘బాలీవుడ్‌లో అగ్రహీరోలతో నటించడం మీరు అదృష్టంగా భావిస్తారా?’ అని విలేకర్లు ప్రశ్నించారు.
సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, రణ్‌వీర్ సింగ్, షాహిద్ కపూర్ వంటి స్టార్లతో నటించడం తాను అర్హురాలిని అని ఆమె తెలిపారు. ఆ సినిమాల్లో తనని ఎంపిక చేసుకోవడంపై దర్శక, నిర్మాతలకు కొన్ని కారణాలు ఉంటాయని వివరణ ఇచ్చారు. సినిమాల్లో అవకాశం వచ్చినప్పుడు పాత్రకు న్యాయం చేయాలనేది తన లక్ష్యమని, అలా చేస్తే తనకు అదృష్టం వరించినట్లేనని తెలియజేశారు. తన సినీ జీవితంలో అదే జరిగిందని, అదృష్టం వల్లే అవకాశాలు వచ్చాయని అనుకుంటే తనకు బాధలేదన్నారు.
‘స్టార్ హీరోల సినిమాలలో మాత్రమే నటిస్తారా? చిత్రాలను మీరు ఎలా ఎంచుకుంటారాు?’ అని విలేకరి ప్రశ్నించాడు?
స్టార్ హీరోల గురించి పదే పదే ప్రశ్నించడంతో పూజాహెగ్డేకు కొపం చిర్రెత్తుకొచ్చింది. ‘అసలు మీ సమస్య ఏంటి’ అని పూజా జర్నలిస్టులను ప్రశ్నించింది. అక్కడ ఘర్షణ వాతావరణం లాగా కనిపించడంతో షాహిద్ కపూర్ వెంటనే కలుగజేసుకొని సరదాగా మాట్లాడారు. ‘నువ్వు యాక్ట్ చేసిన స్టార్ హీరోలంటే ఆ జర్నలిస్టు ఇష్టం అనుకుంటానని, అతను కూడా ఆ హీరోల పక్కన యాక్ట్ చేయాలనుకుంటున్నారేమోనని, అందుకే నీ సలహాలు తీసుకుంటున్నారు’ అని జోకులు వేయడంతో అక్కడి ఉన్నవారు చిరునవ్వు నవ్వుకున్నారు.