Sunday, February 2, 2025

వివాహేతర సంబంధం… తప్పించుకోవడానికి చెరువులో దూకినా కొట్టి చంపారు

- Advertisement -
- Advertisement -

అమరావతి: అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను భార్య చంపింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం జగ్గువాని చెరువులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. బొబ్బిలిపేట గ్రామంలో జి చంద్రయ్య(42), ఈశ్వరమ్మ అనే దంపతులు నివసిస్తున్నారు. ఈశ్వరమ్మకు చింతాడ బాలమురళీ కృష్ణ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం చంద్రయ్యకు తెలియడంతో దంపతులు మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. అక్రమ సంబంధానికి చంద్రయ్య అడ్డుగా ఉండడంతో ప్రియుడితో కలిసి భార్య ప్లాన్ వేసింది. ఉప్పినవలస గ్రామానికి చెందిన ఏడుగురు యువకులతో కలిసి చంద్రయ్యను చంపాలని ఏడుసార్లు ప్రయత్నించి విఫలమయ్యారు.

జనవరి 25న రాత్రి 7 గంటల సమయంలో ఇంటి నుంచి చంద్రయ్య బయటకు వెళ్లాడు. ఈ విషయం ఈశ్వరమ్మ తన ప్రియుడికి ఫోన్ చేసి చెప్పింది. జగ్గువాని చెరువు వద్ద బైక్‌పై వసున్న చంద్రయ్యను బీర్ సీసాతో కొట్టారు. అనంతరం అతడు చెరువులో దూకి పారిపోతుండగా కర్రలతో కొట్టి చంపి నిందితులు పారిపోయారు. అనంతరం ప్రియుడు ప్రియురాలికి పోన్ చేసి నీ భర్త చనిపోయాడని తెలిపాడు. జనవరి 26న తన భర్త కనిపించడంలేదని స్థానిక పోలీస్ స్టేషన్‌లో భార్య ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి భార్యను అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించడంతో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. ప్రియుడు, ప్రియురాలితో పాటు పది మందిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News