హైదరాబాద్: బిసిసిఐ నమన్ అవార్డుల కార్యక్రమంలో టీమిండియా మాజీ, ప్రస్తుత క్రికెటర్లు హాజరయ్యారు. నమన్ అవార్డుల కార్యక్రమంలో క్రికెటర్లు సందడి చేశారు. సచిన్ టెండూల్కర్ జీవితకాల సాఫల్య పురస్కారం దక్కడంతో అందరూ ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. పురుష, మహిళా క్రికెటర్లు ప్రత్యేక చిట్‌చాట్‌లు నిర్వహించారు. బిసిసిఐ తన ఖాతాలో పోస్టు చేయడంతో వైరల్ మారాయి. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు సంబంధించిన చిట్‌చాట్ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. హార్ధిక్ పాండ్యా, మహిళా క్రికెటర్లు స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్‌తో కలిసి రోహిత్ శర్మ చిట్‌చాట్‌లో పాల్గొన్నారు.
హాబీల్లో దేనినైనా తోటి క్రికెటర్లు ఆట పట్టించారా? అని రోహిత్‌ను స్మృతి అడిగారు?
ఇప్పటివరకు తెలియదు కానీ ఓ విషయంలో మాత్రం టీజ్ చేశారని, ఎక్కువగా తాను మరిచిపోతానని, అది మాత్రం తన హాబీ కాదన్నారు. వాలెట్, పాస్‌పోర్టు మరిచిపోయినట్లు చెబుతుంటారని, అది మాత్రం వాస్తవం కాదని చెప్పారు.
ఇప్పటివరకు ఏదైనా అతిపెద్ద విషయం మరిచిపోయారా? అని రోహిత్‌ను స్మృతి ప్రశ్నించింది.
‘ఈ విషయం నేను మాత్రం చెప్పలేనని, నా సతీమణి రితిక చూస్తుంది కావునా తాను చెప్పలేను, ఆ విషయం నాలోనే ఉంచుకుంటాను’ అని సరదాగా మాట్లాడారు. ఈ వీడియో వైరల్ కావడంతో రోహిత్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. హోటల్ రూమ్‌లో వెడ్డింగ్ రింగ్‌ను రోహిత్ మరిచిపోయారని అభిమానులు గుర్తు చేశారు.
ఈ సందర్భంగా రోహిత్ ప్రసంగించారు. టీమిండియాకు సేవలందించిన గొప్ప ఆటగాళ్లను కలవడం సంతోషంగా ఉందని, మన ఆలోచనలను పంచుకోవడం ఇంకా బాగుందన్నారు. అద్భుతంగా ఆడిన వారికి రివార్డు పక్కగా దక్కుతుందని రోహిత్ పేర్కొన్నారు. గతంలో హైదరాబాద్‌లో ఇలాంటి కార్యక్రమం జరిగిందని, ఇప్పుడు ముంబయిలో నిర్వహించడంతో ఆనందంగా ఉందన్నారు.
https://publish.twitter.com/?url=https://twitter.com/BCCI/status/1885701677472448622#