Monday, February 3, 2025

డాన్యూబ్ వంతెనను దిగ్బంధించిన సెర్బియా విద్యార్థులు

- Advertisement -
- Advertisement -

సెర్బియా ఉత్తరాది నగరం నొవి సాడ్‌లో విద్యార్థులు చలి వాతావరణంలో గుడారాలు, స్లీపింగ్ బ్యాగ్‌లలో గడుపుతూ డాన్యూబ్ వంతెన దిగ్బంధనానికి సారథ్యం వహించారు. ఈ బాల్కన్ దేశంలో భారీ మార్పులు కోరుతూ తమ అవినీతి వ్యతిరేక ఉద్యమంలో భాగంగా వారు ఆ నిరసనకు పూనుకున్నారు. సెర్బియాలో శక్తిమంతుడైన అధ్యక్షుడు అలెగ్జాండర్ వుసిచ్ సానుభూతిపరుల దాడుల అవకాశం, ఇతర సంఘటనల నుంచి విద్యార్థులను కాపాడాలని తాము వాంఛిస్తున్నామంటూ డజన్ల సంఖ్యలో రైతులు మోస్ట్ స్లొబోడ్ లేదా ఫ్రీడమ్ బ్రిడ్జ్ మార్గంలో తమ ట్రాక్టర్లను నిలిపారు. నొవి సాడ్ వాసులు వారికి టీ, కాఫీ, పాన్‌కేకులు, పేస్ట్రీ, వండిన ఆహారం తీసుకువచ్చారు. నొవి సాడ్‌లో సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో కాంక్రీట్ ఛత్రం నవంబర్ 1న కూలిపోయినప్పుడు 15 మంది హతులు కాగా, ఆ దుర్ఘటన ఆధారంగా సెర్బియాలో విశ్వవిద్యాలయ విద్యార్థులు భారీ స్థాయిలో అవినీతి వ్యతిరేక ఉద్యమానికి సారథ్యం వహిస్తున్నారు.

\రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ సమయంలో అవినీతి చోటు చేసుకోవడం వల్లే ఆ దుర్ఘటన సంభవించిందని విమర్శకులు భావిస్తున్నారు. సెర్బియాలో చట్టబద్ధ పాలన పట్ల విస్తృత అసంతృప్తికి అది అద్దం పడుతోంది. ‘మా డిమాండ్లు అన్ని తీరినప్పుడే ఇది (నిరసన) అంతం అవుతుంది’ అని విద్యార్థి లూసిజా మస్లాకొవిచ్ చెప్పాడు. విద్యార్థులు కూలంకష దర్యాప్తును కోరుతున్నారు. కాగా, సెర్బియా వ్యాప్తంగా రోజుఊ నిరసనలు సాగుతుండడం వుసిచ్‌కు పెద్ద సవాల్‌గా పరిణమిస్తున్నాయి. విద్యార్థుల ఉద్యమం ఈ వారం వుసిచ్ మిత్రుడు, ప్రధాని మిలోస్ వుసెవిచ్, ప్రభుత్వం రాజీనామాకు దారి తీసింది. పకడ్బందీ నియంత్రణలోని ప్రభుత్వ అనుకూల మీడియా ఈ నిరసనలను చాలా వరకు అలక్షం చేసింది. అప్పుడప్పుడు బోగస్ వార్తలు, నిర్మానుష్య వీధుల ఫోటోలు ప్రచురించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News