కేంద్ర బడ్జెట్‌లో పేర్కొన్న మేరకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాల్లో 95 శాతం పథకాల్లో తెలంగాణకు లబ్ది చేకూరుతుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. అలాగే రాష్ట్రంలో నమోదై ఉన్న 10 లక్షల ఎంఎస్‌ఎంఈలకు ప్రయోజనం భారీ ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు, మంత్రులు చేస్తున్న విమర్శలు, ఆదివారం నాడు ట్యాంక్ బండ్ సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ తరపున కాంగ్రెస్ పార్టీ
చేపట్టిన నిరసనపై కిషన్‌రెడ్డి స్పందించి మీడియాతో మాట్లాడారు. అలాగే స్టార్టప్‌లకు రూ.10 వేల కోట్లతో నిధులు ఏర్పాటు చేయడం వల్ల తెలంగాణ స్టార్టప్‌లకు ఎంతో లబ్ధి చేకూరుతుందని తెలిపారు. కేంద్రంలో తెలంగాణ పన్ను వాటా రూ.27 వేల కోట్ల నుంచి రూ.30 వేల కోట్లకు పెరిగినట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఏ పథకం తీసుకొచ్చినా దాని లబ్ధి తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాష్ట్రానికి ఖచ్చితంగా దక్కుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు.