- Advertisement -
ప్రధాని నరేంద్ర మోదీ 5 వ తేదీన మహా కుంభమేళాను సందర్శిస్తారు. దీంతో మేళా నిర్వహక యంత్రాంగం, పోలీసులు మరింత జాగ్రత్తగా విధులు నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు.మౌని అమావాస్య నాడు సంగంలో తొక్కిసలాట, 30 మంది మృతి, 60 మందికి పైగా గాయపడడంతో అడుగడుగునా పోలీసులు జనాల్ని అదుపు చేస్తూ ఇప్పటికే జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. మహా కుంభ మేళా సందర్భంగా, వసంత పంచమి తర్వాత ఫిబ్రవరి 13న మాఘ పూర్ణిమ , ఫిబ్రవరి 26న మహా శివరాత్రి అత్యంత పుణ్య దినాలుగా భావిస్తున్నారు. ఆ రోజులలోనూ కోట్లాది మంది స్నానాలు ఆచరించే అవకాశం ఉంది. జనవరి 13న పుష్య పౌర్ణిమ నాడు ప్రారంభమైన మహా కుంభ మేళా.. మహా శివరాత్రినాడు అంటే మార్చి 26న ముగుస్తుంది.
- Advertisement -