Monday, February 3, 2025

ఇది చారిత్రాత్మక విజయం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

టీ 20 వరల్డ్ కప్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించిన టీం ఇండియా అండర్ -19 ఉమెన్స్ జట్టుకు బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. ఇది చారిత్రాత్మక విజయం అని కొనియాడారు. భారత్‌కు చెందిన అండర్ -19 ఉమెన్స్ జట్టు.. టీ 20 వరల్ కప్పును కైవసం చేసుకోవడం మనల్ని గర్వపడేలా చేసిందని పేర్కొన్నారు. టీం ఇండియా ఉమెన్స్ జట్టుకు భవిష్యత్తులో ఉజ్వల భవిష్యత్ ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష అద్భుతంగా రాణించిందని ప్రశంసించారు. టీం ఇండియా గెలుపునకు ఎంతో సహకారం అందించిన త్రిషకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌ను గెలుచుకున్న త్రిష మ్యాచ్‌ను ముందుండి నడిపించి విజయ తీరాలకు చేర్చారని కెటిఆర్ ప్రశంసించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News