Monday, February 3, 2025

రెండు రెళ్లు నాలుగు

- Advertisement -
- Advertisement -

1.
పొద్దున్నేవాకిట్లో రెండు పిట్టలువచ్చి వాలాయి
వాటితో ఆడుకోడానికి కిరణాలు
ఎక్కడ్నుంచో రానే వచ్చాయి
2.
నిన్నటిలోంచి ఇవ్వాళ్టిలోకి
ప్రయాణిస్తున్నప్పుడు
విశ్రాంతి వృక్షంలా సేదతీర్చింది రాత్రి
ఆ చెట్టుమీదఎన్ని కలల పక్షులో!
3.
ప్రేమను పంచినంత కాలం తీసుకున్నావు
ఇప్పుడు నాకు అవసరం ఉంది
తిరిగి కొంచెం ఇవ్వవా!?
4.
తెల్లారిందని అలారం
‘కిచ కిచమని’మని లేపుతుంది
నిద్రకళ్ళలో తేలియాడుతూ సగం కల
పక్షుల పాటల్ని వెలివేసింది నగరం
లేవకతప్పని తిప్పలను గుర్తుచేస్తూ
కిచకిచల అలారం
5.
ఆకాశాన్ని అనేక రంగుల్లో నింపేందుకేమో
కొమ్మల్లో రెమ్మల్లో ఆకుల్లో
అక్కడక్కడా నిద్రిస్తూ నీడలు
లేతగా మొదలై ముదురు వర్ణంగా నవ్వే నీడలు
దాక్కునే నీడలు, దాచుకునే నీడలు
చిగురించే నీడలు.
6.
కవిత్వం, అక్షరాలు, పదాలు, వాక్యాలు
మాత్రమే కాదు -కాచి వడబోసిన జీవితం!
కవిత్వం, సమాజ చలనాల్ని అప్రమత్తంగా
నిరంతరం గమనించే నిశితమైన చూపు
కవిత్వం, ఆలోచనకు శూన్యానికి మధ్య
విస్తరించిన వంతెన కవిత్వం,
నిన్ను నీకే పరిచయం చేసే అద్దం
వాక్యం వాస్తవం కావడం,
వాక్యం జీవితం కావడం
వాక్యం మనిషిగా మారడం కవిత్వం
7.
ఆకాశం కన్నా నాకు ఆత్మీయమైనదేదీ లేదు.
నిజానికి, ఈ కాళ్ళూనుకునే స్థలం తప్పా
నాకంటూ ఇక్కడ ఏమీలేదు
ఆకాశం, ఈ కాళ్ళూనే స్థలం ఇవి రెండే నిజాలు
కవి యాకూబ్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News