పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో ‘ది రాజా సాబ్’తో పాటు దర్శకుడు హను రాఘవపూడి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ కూడా ఒకటి. ఈ సినిమాను డైరెక్టర్ పూర్తి పీరియాడిక్ వార్ అండ్ రొమాంటిక్ మూవీగా తీర్చిదిద్దుతున్నారు. ఇక ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. అయితే, ఈ సినిమాలో ప్రభాస్ ఎలాంటి పాత్రలో కనిపిస్తాడా అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సినీ సర్కిల్స్ ప్రకారం ఈ సినిమాలో ప్రభాస్ సైనికుడిగా కనిపిస్తాడట. ఇక ఆయన సరసన యంగ్ బ్యూటీ ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే, ఈ సినిమాలో ఓ కీలక ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ఉంటుందని.. ఈ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో ఓ స్టార్ బ్యూటీ కనిపించనుందనే టాక్ వినిపిస్తుంది. దీంతో ఇప్పుడు ఈ చిత్ర ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
మరి ఈ నిజంగానే ఈ మూవీలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ .ఉందా… ఉంటే, అందులో సర్‌ప్రైజ్ చేసే ఆ స్టార్ ఎవరా.. అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ప్రభాస్ అంటేనే అతిథి మర్యాదలకు మారుపేరు అని చెప్పాలి. ప్రభాస్ సినిమా షూటింగ్ లొకేషన్లో ఉన్నారు అంటే అక్కడ వారందరికీ కూడా వారికి నచ్చిన ఆహార పదార్థాలను స్వయంగా ఇంటి నుంచి తయారు చేయించి తీసుకువస్తూ ఉంటారు. ఇప్పటికే ఈయన పెట్టే ఆతిథ్యం గురించి ఎంతోమంది గొప్పగా చెప్పారు. తాజాగా నటి ఇమాన్వికీ సైతం ప్రభాస్ తన ఇంటి రుచులను చూపించారు. ఆమె కోసం వివిధ రకాల వెజ్, నాన్ వెజ్ వంటలను స్వయంగా తన ఇంటిలో తయారు చేయించి పంపించారు దీంతో ఆమె ఒక్కసారిగా సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా ఈ విషయాన్నీ ఇమాన్వి సోషల్ మీడియా వేదికగా తెలియచేసింది. భోజనాన్ని పంపించిన ప్రభాస్ కి దన్యవాదాలు, ఫుడ్ చాలా టేస్టీగా ఉందంటు ట్వీట్ చేసింది.