Monday, February 3, 2025

బిసి జనాభా 56.33%

- Advertisement -
- Advertisement -

మంత్రివర్గ ఉపసంఘానికి సమగ్ర కులగణన సర్వే నివేదిక అందజేత రేపు కేబినెట్
భేటీ, విస్తృత చర్చ అదే రోజు అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్న ప్రభుత్వం
సర్వే చారిత్రాత్మకం, రాహుల్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం కొందరు
అడ్డుకోవాలని చూసినా..అధికారులు విజయవంతం చేశారు సమాజంలో విప్లవాత్మక
మార్పు దిశగా మా ప్రభుత్వం ముందుకెళ్తోంది : మంత్రులు ఉత్తమ్, దామోదర,
పొన్నం, సీతక్క నేడు కేబినెట్ సబ్ కమిటీకి ఎస్‌సి వర్గీకరణపై నివేదిక

మనతెలంగాణ/హైదరాబాద్:జనాభా దామా షా నిష్పత్తి ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల లో రిజర్వేషన్లు కల్పించే లక్షంతో రాష్ట్ర ప్ర భుత్వం సామాజిక, రాజకీయ, -ఆర్థిక, విద్య, ఉపాధిపై నిర్వహించిన సమగ్ర కులగణన స ర్వే నివేదిక ప్రభుత్వానికి అందింది. ఈ అం శంపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘానికి రాష్ట్ర ప్రణాళిక శాఖ ఆదివారం నివేదికను అందజేసింది. దీనిపై చర్చించిన అనంతరం ఈ నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్న ట్టు మంత్రివర్గ ఉప సంఘం చైర్మన్, మంత్రి ఉ త్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. ఇ లా ఉండగా ఎస్సీ ఉప కులాల వర్గీకరణపై జ స్టిస్ డాక్టర్ షమీమ్ అక్తర్ నేతృత్వంలో ఏర్పా టు చేసిన ఏకసభ్య న్యాయ కమిషన్ తన నివేదికను సోమవారం మంత్రివర్గ ఉప సంఘాని కి అందజేయనున్నారు. ఈ రెండింటిపై చర్చిం చి ఆమోదించడానికి మంగళవారం మంత్రిమండలి సమావేశం ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మంత్రిమండలి ఆ మోదించిన వెంటనే అదే రోజు ప్రత్యేకంగా అ సెంబ్లీ సమావేశమై దీనికి చట్టబద్ధత కల్పించనున్నది.

రాష్ట్ర ప్రభుత్వానికి తాము సమర్పించనున్న కులగణన సర్వే నివేదికలోని అంశాలను మంతివర్గ ఉప సంఘం చైర్మన్, మంత్రి ఉత్తమ్, తన సహచర సభ్యులు మంత్రులు దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్, సీతక్కతో కలిసి మీడియాకు వెల్లడించారు. బీ సీల జనాభా 56.33 తేలింది. ఇందులో బీసీ లు 46.25శాతం కాగా బీసీ ముస్లీంల జనా భా10.08శాతంగా తేలింది.మొత్తంగా బీసీల జనాభా56.33శాతంగా  లెక్క తేలింది. అలాగే ఎస్సీలు 17.43 శాతం, ఎస్టీలు 10.45 శాతం, ఓసీ ముస్లీంలు 2.48 శాతం, అగ్రకులాలు 13.31 శాతం మేరకు ఉన్నట్లు నివేదికలో తేలినట్టు మంత్రివర్గ ఉపసంఘం వెల్లడించింది. ఏడాది క్రితం మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం మేరకు అసెంబ్లీలో తీర్మాణం చే సి ఏడాది లోగా కులగణన సర్వేను పూర్తిచేసి ప్రభుత్వం తన చిత్తశుద్దిని నిరూపించుకుందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సరిగ్గా ఏడాది కిందట రాష్ట్ర ప్రభుత్వం కులగణన సర్వేకు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో యాబై రోజుల వ్యవధిలో కులగణన పూర్తి చేయడం చరిత్రాత్మకమని మంత్రివర్గ ప సంఘం చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కో చైర్మన్ దామోదర రాజనరసింహ, సభ్యులు పొన్నం ప్రభాకర్, సీతక్క కొనియాడారు.

రాష్ట్రంలో కులగణన, దాని ఆవశ్యకతలను వివరిస్తూ ఈనెల 4వ తేదీన ఉదయం పది గంటలకు కేబినెట్ సబ్ కమిటీ నివేదికపై మంత్రి వర్గ సమావేశం నిర్ణయం తీసుకుంటుందని, అదే రోజు పదకొండు గంటలకు శాసనసభలో చర్చ జరుగుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,54,77,554 మందిని 50 రోజుల వ్యవధిలో సర్వే నిర్వహించి అద్భుతమైన రికార్డును నమోదు చేసిందని ఆయన పేర్కొన్నారు.
2023 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధినేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తీసుకు రావడం చరిత్రాత్మక అంశంగా ఆయన అభివర్ణించారు. ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ సర్వే వివరాలను వెయ్యిపేజీలతో కూడిన పుస్తకం రూపంలో ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, రాష్ట్ర నోడల్ అధికారి అనుదీప్ దురిశెట్టి ఆదివారం మధ్యాహ్నం సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలోని మంత్రివర్గ ఉప సంఘానికి అందజేశారు. సామాజిక న్యాయానికి వేస్తున్న పెద్ద పీట వేసేందుకు ఈ సర్వే ఇతోదికంగా ఉపయోగపడుతుందని మంత్రి ఉత్తమ్ అన్నారు. ఈనెల 4వ తేదీన ఉదయం పది గంటలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తీసుకుని పదకొండు గంటలకు అసెంబ్లీలో చర్చకు పెట్టనున్నట్లు ఆయన తెలిపారు.

యాబై రోజుల్లో సర్వే పూర్తి
కులగణన సమగ్ర సర్వే కార్యక్రమం యాబై రోజుల్లో పూర్తిచేసి రికార్డు సృష్టించినట్లు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ లు చెప్పారు. సరిగ్గా ఏడాది క్రితం నిర్ణయం తీసుకుని ఏడాదిలోపే దానికి చట్టబద్ధత కల్పించేందుకు ప్రభుత్వం చేస్తున్న సాహసోపేత నిర్ణయంగా వారు అభివర్ణించారు. సర్వేకు 96.9 శాతం మంది సహకరించారని, 3.54కోట్ల మంది సర్వేలో పాల్గొని తమ పూర్తి వివరాలు అందజేశారని, కేవలం 3.01 శాతం (16 లక్షల మంది) వివిధ కారణాల వల్ల సర్వేలో పాల్గొనలేకపోయారని చెప్పారు.
దేశంలోనే రికార్డు
కర్నాటక, బీహార్ సర్వేలను అధ్యయనం చేసి ఎలాంటి లోటుపాట్లకు ఆస్కారం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా కులగణన సర్వే పూర్తిచేసిందని మంత్రులు చెప్పారు. స్వాతంత్య్రం తర్వాత జరిగిన అతిపెద్ద సర్వే ఇది అన్నారు. సర్వేలో 94,863 మంది ఎన్యూమరేటర్లు, 9,628 మంది సూపర్‌వైజర్లు, 94,261 ఎన్యూమరేటర్ బ్లాక్స్‌తో 96.9% తెలంగాణ కుటుంబాలను కేవలం యాబై రోజుల్లో పూర్తి చేసి దేశంలోనే రికార్డు సృష్టించినట్లు వెల్లడించారు.

గవర్నర్‌తో సర్వే మొదలు
రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ తొలి స్పందనకర్తగా పాల్గొని అధికారికంగా సర్వే ప్రారంభించిన విషయాన్ని మంత్రులు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ సర్వే నమోదుకు 76వేల మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు 36 రోజుల్లో పూర్తి సమాచారాన్ని డిజిటలైజ్ చేశారని తెలిపారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సాఫల్యంగా అమలు కోసం డిజిటల్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసిందని చెప్పారు.
సర్వేకు సవాళ్ళు
కుల గణన సర్వేను అడ్డుకునేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నించినప్పటికీ ప్రజల సహకారంతో దానిని విజయవంతం చేశామని మంత్రులు తెలిపారు. సర్వే విషయంలో తప్పుడు ప్రచారాలు, హైకోర్టులో పిల్‌లు దాఖలు కావడం వంటివి ఎదురు అయ్యాయని వారు వివరించారు. కానీ, న్యాయస్థానం ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునివ్వడంతో సర్వే సమగ్రంగా కొనసాగిందన్నారు. 1.03 లక్షల ఇళ్లు తలుపులు వేసి ఉండటం, 1.68 లక్షల కుటుంబాలు మొదట్లో పాల్గొనడానికి సంకోచించడం, 84,137 ఇళ్లు నివాసేతరంగా ఉండటం వంటి సమస్యలు సర్వేలో ఎదురైనట్లు వివరించారు.

డాటా బేస్‌లో ముందంజ
తెలంగాణ డేటా ఆధారిత పరిపాలనలో ముందంజలో ఉందని కులగణన సర్వే ద్వారా వెల్లడించిందని మంత్రులు చెప్పారు. ఇది కేవలం డేటా సేకరణ ప్రక్రియ మాత్రమే కాకుండా, సామాజిక న్యాయ విప్లవంగా వారు పేర్కొన్నారు. తెలంగాణ పెద్ద స్థాయి డేటా సేకరణలో కొత్త ప్రమాణాలను నెలకొల్పిందని, ఈ సర్వే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు.
కులగణనలో పురుషులు 50.51 శాతం
కులగణన సర్వేలో పాల్గొన్న వారు 3,54,77,554 మంది కాగా, వారిలో పురుషులు 17921183 మంది(50.51 శాతం), మహిళలు 17542597 మంది(49.45 శాతం), థర్డ్ జండర్ 13774 మంది (0.04 శాతం) చొప్పున ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News