Monday, February 3, 2025

15లోపు పంచాయతీ నోటిఫికేషన్

- Advertisement -
- Advertisement -

కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి అర్హులైన ప్రతి ఒక్కరికీ
ఇందిరమ్మ ఇళ్లు రైతుల పట్ల అధికారుల అలసత్వం వద్దు
ఖమ్మం జిల్లా పర్యటనలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

మన తెలంగాణ/వైరా: ఈ నెల 15వ తేదీ లోపు పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందని రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖ మ్మం జిల్లా, వైరా మండలంలో ఇటీవల మరణించిన పలు కుటుంబాలను ఆయన ఆదివారం పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు వస్తున్నందున కార్యకర్తలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు కట్టించి తీరుతామని అన్నారు. విప్పలమడకలో మేడా సంపత్ అనే ఓ విలేకరి తల్లి ఇటీవల మరణించటంతో ఆ కుటుంబా న్ని పరామర్శించి ఓదార్చారు. ఇదే సమయంలో పలువురు రైతులు మంత్రినికలిసి తమ వరి ధన్యాన్ని కొనుగోలు చేయటంలో అధికారులు అలసత్వం వహిస్తున్నార ని విన్నవించుకున్నారు. వెంటనే స్పందించిన ఆయన రైతులు పండించిన ధా న్యాన్ని చివరి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు.

వెంటనే ఖ మ్మం జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్‌కు ఫోన్ చేసి జిల్లాలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేలా తక్షణమే చర్యలు చేపట్టాలని సూచించారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను ఇబ్బంది పెట్టోద్దని అన్నారు. అనంతరం గరికపాడులో అనారోగ్యంతో బాధపడుతున్న తేళ్ళూరి విజయరావును పరామర్శించారు. గన్నవరం గ్రామంలో ఇటీవల మరణించిన కొటిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. వైరాలో ఇటీవల మరణించిన వెంపటి రంగారావు కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబాన్ని ఓదార్చారు. ఆ కుటుంబానికి అన్ని విధాల అండగా ఉం టామన్నారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు దార్నా రాజశేఖర్ ఉప్పలమ్మ ఇ చ్చిన తేనేటి విందును స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వైరా ఎంఎల్‌ఎ మాలోత్ రాందాస్ నాయక్, మార్కెఫెడ్ మాజీ వైస్ ఛైర్మన్ బొర్రా రాజశేఖర్, వైరా మున్సిపల్ మాజీ ఛైర్మన్ సూతకాని జైపాల్, విజయభాయి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శీలం వెంకటనర్సి రెడ్డి, ఎఎంసి మాజీ ఛైర్మన్ రత్నం, మిట్టపల్లి నాగి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News