- Advertisement -
వేరే వారితో పెళ్లి చేస్తే యాసిడ్ పోసి చంపేస్తానని ఓ యువకుడు యువతిని బెదిరించిన సంఘటన ఆదివారం పెనుబల్లి మండలంలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే..పెనుబల్లి మండలం వీఎం బంజర గ్రామంలో నివసిస్తున్నాడు. పదవ తరగతి చదివిన బొర్రా సాయి మహేందర్ జఉలాయి గా తిరుగుతూ తాగుడుకు బానిసయ్యాడు.మద్యం మత్తులో ఆదివారం సాయంత్రం సాయి మహేందర్ యువతి పై యాసిడ్ తో దాడికి యత్నించాడు.ఇంటర్ చదువుతున్న యువతి కాలేజీ వద్దకు సాయి మహేందర్ వెళ్లి కాలేజీ నుంచి బయటకు రాకుంటే చంపేస్తానని చేతులు కోసుకున్నాడు. దీంతో భయ బ్రాంతులకు గురైన యువతి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు చెప్పింది. యువతి తల్లి దండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.
- Advertisement -